టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత పేరుకు ప్రత్యేకమైన పరిచయవసరం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీకి అడుగుపెట్టి దశాబ్దం పైన అవుతున్న స్టార్ హీరోయిన్గా అదే క్రేజ్ తో కొనసాగుతుంది. ఇటీవల నటించిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది సమంత. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు వస్తున్న ఒక సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తన అనారోగ్యంతో ఆరోగ్యం పూర్తిగా కుదుటపడె వరకు సినిమాల్లో సినిమాల్లో నటించినని ఫిక్స్ అయిపోయింది.
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత తనకు నచ్చిన పనులను చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. మొన్నటి వరకు భక్తి మార్గంలో ప్రయాణించిన సమంత ప్రస్తుతం ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో రెండు వీడియోలను షేర్ చేయగా అందులో ఆమె చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
సమంత మరో అమ్మాయితో కలిసి ఓ ఫీట్ చేసింది. తన కాళ్లపై ఆ అమ్మాయిని సులువుగా లేపింది. దానికి ఇది మా పార్టీ అంటూ క్యాప్షన్ పెట్టి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో చాలామంది నెటిజన్స్ పార్టీ అంటే ఇదా..? నీతో పార్టీ ఇలా ఉంటుందా..? సమంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మామూలుగానే సమంతకు ఫిట్నెస్ మీద మక్కువ. ఎప్పటికప్పుడు చాలా కష్టమైన స్టంట్లు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఆమెకి ఫ్రీ టైం దొరకడంతో మరిన్ని వ్యాయామాలు చేయడం విశేషం. ఇక సమంత ఇటీవల నటించిన ఖుషీ, సిటాడెల్ షూటింగ్స్ పూర్తిచేసుకున్నాయి. సమంత కొత్త సినిమాలో నటించకపోయిన ఈ సినిమా ప్రమోషన్స్ కు వస్తుందని టాక్ వినిపిస్తుంది.