పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ బ్రో. కోలీవుడ్ లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన బ్రో సినిమాకు ప్రముఖ తమిళల నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ థియేటర్లలోకి వచ్చి ఏడాది దాటుతోంది. దీంతో మెగా అభిమానులు, పవన్ అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రన్ టైం పై క్లారిటీ వచ్చింది.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా టోటల్ రమ్ టైం రెండు గంటల 14 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉండనుంది. మొత్తం 134 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ – కేతిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాకు పేరుకు మాత్రమే సముద్రఖని దర్శకత్వం వహించిన తెరవెనక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అన్ని తానై నడిపించారు. రు. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ తో బ్రో థియేటర్లలోకి వస్తోంది. సెన్సార్ టాక్ ప్రకారం బ్రో పక్కాగా హిట్టే అంటున్నారు.