టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకడు. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు. ఇక వకీల్ సాబ్ సినిమాలో పవన్ తో కలిసి నటించిన లిరీష ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వివరించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.
లిరీష మాట్లాడుతూ..” చాలామంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ కు మాత్రం చాలా మంది డై హార్ట్ ఫాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి తర్వాత పవన్ కళ్యాణ్‌ని మాత్రమే అభిమానులు అంతలా కొలుస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు “అంటూ లిరిష చెప్పుకొచ్చారు. నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పింది. నా అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ బ్లెస్స్డ్ హీరో అని అంత మంది అభిమానులను సంపాదించడం సాధారణ విషయం కాదు అంటూ వివరించింది.
ఇక రాజకీయాల గురించి ఎక్కువగా నాకు అవగాహన లేదు నేను దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అంటూ పేర్కొంది. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉండే హీరో అని వివరించింది. ప్రస్తుతం లిరీష మాట్లాడిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించింది. బ్రో మూవీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.