ఇటీవల సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి వార్తలు ఏ రేంజ్ లో వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ఏదో ఒక వార్త ఎప్పుడూ కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగబోతోంది. రీసెంట్ గానే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.
త్వరలోనే వీరి పెళ్లికూడా చేసుకుని దంపతులు అవ్వనున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఈ జంట అఫీషియల్ గా కొన్ని పోస్ట్ లు పెడుతూ వస్తున్నారు. పెళ్లికి ముందే ఇటీవల చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోన్న ఈ జంట కొన్ని ఫోటోలు కూడా అప్లోడ్ చేశారు. మొదట్లో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమిస్తున్నాను అని వరుణ్ చెపితే మెగా ఫ్యామిలీ త్వరగా ఒప్పుకోలేదట.
ఆ తర్వాత ఒప్పుకున్నా కూడా ఒక కండిషన్ పెట్టారట. పెళ్లి తర్వాత లావణ్య సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలని.. అలా అయితేనే వరుణ్‌తో అమె పెళ్లిని చెప్పారట. దీనికి లావణ్య త్రిపాఠి కూడా అంగీకరించి నాకు వరుణ్ కన్నా ఏది ఎక్కువ కాదని పెళ్లికి ఒప్పుకుందట. ఇది తెలిసిన లావణ్య అభిమానులు మెగా ఫ్యామిలీపై కామెంట్లు కూడా చేశారు.
మీ కూతురు పెళ్లి తర్వాత సినిమాలు చేయొచ్చు కానీ.. కోడలు చేయకూడదు అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. మెగా ఫ్యామిలీ ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని… మీరైనా కనీసం విడాకులు తీసుకోకుండా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని వీరికి శుభాకాంక్షలు చెపుతున్నారు. నిహారిక విడాకులు తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయన్న వార్తలకు కూడా ఈ ఎంజాయ్‌మెంట్‌తో చక్కగా చెక్ పెట్టేసింది.