మ‌హేష్ కూతురు సితార వీడియో చూశారా… నాన్న‌ను మించిన అందం… కుంద‌న‌పు బొమ్మే ( వీడియో )

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలో నటిస్తారు. మరో నాలుగు సంవత్సరాల పాటు ఈ రెండు సినిమాలతోనే మహేష్ కు టైం సరిపోయేలా ఉంది. ఇటు సినిమాలతో బిజీగా ఉండే మహేష్ తన ఫ్యామిలీకి కూడా ఎప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు.

మహేష్ కొడుకు గౌతమ్ ఇప్పటికే ఒక సినిమాలో నటించాడు. ఇక మహేష్ కూతురు సితార మాత్రం ఇప్పటినుంచే తన తండ్రిని మించిపోయేలా అలరిస్తోంది. ప్రస్తుతం సితార వయసు 11 సంవత్సరాలు అయితే ఏ సెలబ్రిటీ కిడ్‌కి సాధ్యం కానీ విధంగా ఒక ప్రకటనలో ఆమె నటించింది. ఇందుకోసం సితారకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది.

ఇది పక్కన పెడితే ఈ మొత్తాన్ని ఆమె ఛారిటీకి ఇచ్చేసినట్టు స్వయంగా వెల్లడించింది. అలాగే న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైం స్క్వేర్ స్క్రీన్ పై ఈ యాడ్ ని ప్రదర్శించారు. తాజాగా ఈ వీడియోని మహేష్ బాబు తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ యాడ్లో సితార చాలా అనుభవం ఉన్న అమ్మాయిలా నటించింది. కొన్ని చోట్ల యాక్టింగ్ లో ఎంతో అనుభవం ఉన్న అమ్మాయిలా నటించేసింది.

ఆమె స్క్రీన్ ప్రజెన్స్‌, హైట్, స్కిన్ కలర్ తదితర అంశాల్లో తన తండ్రి మహేష్ బాబుని మించి పోతుందేమో అనేలా ఆమె మెస్మరైజ్ చేసింది. ఇక తాను త్వరలోనే సినిమాల్లోకి వస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది సితార. సితార ఇప్పటికే మంచి డ్యాన్సర్ గా ఫ్రూవ్‌ చేసుకుంది. ఏది ఏమైనా ఆమె ఈ వయసులోనే తండ్రిని మించిన కుందనపు బొమ్మలా ఉంది. భవిష్యత్తులో ఆమె ఇంకెన్ని అద్భుతాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)