ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది పూజ హెగ్డే. టాలీవుడ్ లో అగ్ర తారల అందరి సరసన నటించిన పూజా హెగ్డే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అసలు ఒకానొక టైంలో త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తాను స్టార్ హీరోలతో తీసే సినిమాల్లో వరుసగా ఆమెనే హీరోయిన్‌గా రిపీట్ చేస్తూ వచ్చారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాకపోవడంతో అడపాదడపా ఏదైనా ఛాన్స్ రాకపోదా ? అని ఆశతో ఎదురు చూస్తోంది. చేతిదాకా వచ్చిన మహేష్ బాబు సినిమా నుంచి అవుట్ అయ్యింది. ఇంతకన్నా దురదృష్టం ఏం ఉంటుంది. తాజాగా పూజా హెగ్డే గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆమె సూసైడ్ ఎటెంప్ట్ చేసిందంటూ కారణాలు ఇవే అంటూ పలు రకాల పుకార్లు వినిపిస్తున్నాయి.
తాజాగా ప్రముఖ సినీ క్రిటిక్ అని చెప్పుకుంటూ ఉండే ఉమైర్ సంధు, పూజా హెగ్డే గురించి ఒక సంచలన ట్వీట్ చేశాడు. పూజాహెగ్డే నిన్న మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని.. అదృష్టం బాగుంది ఆమె ఫ్యామిలీ వాళ్ళు ఆమెను కాపాడారని.. డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉందని ట్వీట్ చేశాడు.
వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆమె గత రెండు వారాలు నుంచి డిప్రెషన్‌కి గురైందని ఆ నోట్‌లో మెన్షన్ చేశాడు. ఈ వార్తలు ఎంత నిజమో.. పూజా హెగ్డే కుటుంబ సభ్యులు స్పందిస్తే గాని తెలియదు. ఇక పూజ హెగ్డే పై ఉమైర్ సంధు ఇలాంటి సంచలన ట్విట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఉమైర్‌ను బండ బూతులు తిడుతున్నారు.