హీరోయిన్ నందితా శ్వేత‌కు భ‌యంక‌ర‌మైన… క‌ష్టాలు ప‌గోడికి కూడా వ‌ద్దు…!

మ‌న హీరోయిన్లకు చాలా భయలు, ఇబ్బందులు ఉంటాయి. ప్రేమలో పడినా, పెళ్లయినా, తమకున్న శారీరక సమస్యల్ని బయటపెట్టినా అవకాశాలు ఇవ్వ‌ర‌న్న భ‌యంతో ఉంటూ ఉంటారు. ఇది నిజం కూడా..! అయితే ఈ భ‌యాలు.. అవ‌కాశాలు రాక‌పోవ‌డాలు అన్నీ ఒక‌ప్పుడు. ఇప్పుడు మ‌న హీరోయిన్లకు అలాంటి భయాలు అక్కర్లేదు.

ఎవ‌రో ఎందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అలియా, కియరా లాంటి హీరోయిన్లు కూడా పెళ్లిళ్లు చేసుకొని ఇంకా స‌క్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్లు మ‌యోసైటీస్ లాంటి శారీరక సమస్యల్ని కూడా బయటపెట్టినా ఆమెకు అవ‌కాశాలు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. నిజానికి స‌మంత ఎంతో తీవ్ర‌మైన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకే మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె ఎవ‌రో కాదు నందితా శ్వేత.

కొద్ది రోజులుగా హీరోయిన్ నందిత శ్వేత కూడా ఓ శారీరక సమస్యతో బాధపడుతోంద‌ట‌. ఆ జ‌బ్బు పేరు ఫైబ్రోమయాల్జియా అని ఆమే స్వ‌యంగా చెప్పింది. ఈ వ్యాధిలో వెన్నెముక, కండరాల స‌మ‌స్య ఉంటుంది. అంటే సడెన్ గా నీరసం వచ్చేయడం, బ్రెయిన్ నొప్పి గ్ర‌హించ‌లేక‌పోవ‌డం జ‌రుగుతూ ఉంటుంది. ఈ వ్యాధితో నందిత బాధ‌ప‌డుతోంద‌ట‌. నిజంగా నందిత ఇన్ని క‌ష్టాలు ప‌డుతోందంటే మ‌న‌కే షాక్ అనిపిస్తోంది.

దీని వ‌ల్ల క‌నీసం ఆమె ఎక్కువగా వ్యాయామాలు కూడా చేయడం కుదరట్లేదు. తాజాగా ఆమె హిడింబ సినిమాలో పోలీస్ పాత్ర కోసం బరువు తగ్గాల్సి వ‌చ్చింది. ఓవైపు ఆరోగ్యం సహకరించక‌పోయినా కూడా ఎక్సర్ సైజులు చేసి బరువు తగ్గింద‌ట‌ నందిత. హిడింబ ప్రమోషన్స్ లో ఆమె త‌న‌కు ఉన్న ఈ హెల్త్ స‌మ‌స్య‌ను బ‌య‌ట పెట్టింది.

ఇక ఈ సినిమా కోసం తాను ఏకంగా రెండేళ్ల‌కు పైగా క‌ష్ట‌ప‌డ్డాన‌ని నందిత చెపుతోంది. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో నందిత ఫేడ‌వుట్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా హిట్ అయితే త‌ప్పా ఆమె కెరీర్ డేంజ‌ర్లోకి వెళ్లిపోయిన‌ట్టే అవుతుంది.