సితార మైండ్ బ్లాకింగ్ ఆన్స‌ర్లు చూశారా… మ‌హేష్‌, న‌మ్ర‌త‌ను మించిపోయిందే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార టీనేజ్‌లోనే ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటుంది. ఆమె క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సితార ప్రతి విషయంలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియాలో పాట‌ల‌కు డ్యాన్సులు చేస్తూ అద‌ర‌గొట్టే సితార ఇటీవల ఒక ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్‌గా వ్యవహరించింది.

న్యూ ఇయర్ స్క్వేర్ బోర్డ్స్ పై సితార బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వీడియోలు ప్ర‌ద‌ర్శించడం నిజంగా గ్రేట్‌. ఈ యాడ్‌లో ఎంతో అందంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది సితార. తాజాగా ఈ సంస్థ నిర్వహించిన ప్రెస్‌మీట్ లో సితార, నమ్ర‌త పాల్గొన్నారు. సితార ఎంతో అందంగా సిల్వర్ కలర్ లెహంగాలో బుట్ట బొమ్మలా మెరిసిపోతూ కనిపించింది. పీఎంజి జ్యూవెల్ల‌రీ బ్రాండ్ సితార యాడ్ షూట్ చేసింది.

ఈ జ్యువెల్ల‌రీ షాప్ ఓపెనింగ్ ప్రెస్‌మీట్‌లో సితారకి ఎదురైన కొన్ని ప్ర‌శ్న‌ల‌లో ఈ యాడ్‌షూట్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ ఎవరికి ? ఇచ్చార‌ని సితారని అడగ్గా సితార చారిటీ కోసం ఇచ్చాన‌ని సమాధానం ఇచ్చింది. ఫిలిం ఇండస్ట్రీ లోకి వచ్చే ఇంట్రెస్ట్ మీకు ఉందా ? అని అడగగా చాలా ఆసక్తిగా ఉన్నాన‌ని సమాధానం ఇచ్చింది. త‌ర్వాత న‌మ్ర‌త మాట్లాడుతూ సితారని సినిమాలు, ప్ర‌క‌ట‌న‌ల ద్వారా లాంఛ్ చేయాలని మేమెప్పుడూ అనుకోలేదని.. ఈ యాడ్ అవకాశంలో వచ్చిన తర్వాత ఇది సరైన సమయం అనుకుని మేము ఓకే చేశామని చెప్పుకొచ్చింది.

త‌ర్వాత సితార‌ను మీ మ‌మ్మి ఒక‌ప్ప‌టి మిస్ ఇండియా క‌దా ? ఆమె నుంచి మీరు ఏం నేర్చుకున్నార‌ని ప్ర‌శ్నిస్తే సితార కాన్ఫిడెన్స్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. సితార ఆన్స‌ర్ల‌కు విలేక‌ర్ల మైండ్ కూడా బ్లాక్ అయిన‌ట్ల‌య్యింది. సితార ఈ ప్రెస్ మీట్లో తన అందచందాలతో అందరినీ ఆకర్షించ‌డంతో పాటు కాన్ఫిడెన్స్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. సితార సినిమాల్లోకి వస్తే తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సిల్వర్ కలర్ లెహంగాతో సితార క్యూట్ గా బుట్టబొమ్మలా హోయలుకుతూ ఫోజులిస్తూ మెస్మరైజ్ చేసింది.