ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి తరములో ఎన్టీఆర్ ,ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు ఇలా ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. ఆ స్టార్ హీరోలకు ధీటుగా సినిమా రంగంలోకి వచ్చి నిల దొక్కుకోవడంతోపాటు ఆనాటి అమ్మాయిల కలల రాకుమారుడుగా శోభన్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అప్పట్లో శోభన్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అమ్మాయిలు.. ఇంకా చెప్పాలి అంటే కుటుంబంతో సహా అందరూ ఆ సినిమాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారు.
ఆ రోజుల్లోనే శోభన్ బాబుకు కాలేజీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే ముద్దుల ప్రేమికుడు లేదా ముద్దుల మొగుడుగా శోభన్ బాబు పోషించిన పాత్రలు అప్పటి ఆడవాళ్లకు మంచి కిట్ ఇచ్చేవి. శోభన్ బాబు ఆరడుగుల అందగాడు. అసలు అతడి అందానికి పడని అమ్మాయి లేదు అనేవారు. ఎవరో ఎందుకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అయితే శోభన్ బాబును ఏరి కోరి మరి తన దాసుడని చేసుకుందని అంటారు.
శోభన్ బాబు అందానికి జయలలిత అలా పడిపోయింది. ఇంకా చెప్పాలి అంటే ఒక జయలలిత మాత్రమే కాదు. ఆ తరం స్టార్ హీరోయిన్లుగా ఉన్న వాణిశ్రీ, ప్రభ, శారద ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నాటి స్టార్ హీరోయిన్లు శోభన్ బాబు అందానికి ముగ్ధులు అయిపోయే వారట. ఈ క్రమంలోనే శోభన్ బాబుతో సాన్నిహిత్యం కోసం వారంతా ఆరాటపడే వారిని కూడా చెబుతూ ఉంటారు.
శోభన్ బాబుతో షూటింగ్ గ్యాప్ లో ముచ్చట్లు పెట్టడంతో పాటు గంటల తరబడి కబుర్లు కూడా చెప్పేవారట. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు అయితే తమ పర్సనల్ లైఫ్ తో పాటు బెడ్రూంలో జరిగే ముచ్చట్లు కూడా ఆయనతో చెప్పేవారిని.. శోభన్ బాబుని చూస్తే అసలు తాము ఏం ? సీక్రెట్లు ఆయనకు చెబుతున్నాం అన్న విషయాన్ని మైమరిచిపోయి మాట్లాడేసే వారిట.
అలా శోభన్బాబుపై అప్పటి ఇండస్ట్రీ గురించి తెలిసినవారు చెప్పుకుంటూ ఉంటారు. అయితే తనను ఎంతోమంది హీరోయిన్లు వలలో పడేసేందుకు ట్రై చేసినా శోభన్ బాబు మాత్రం తన భార్యకు ఏనాడు అన్యాయం చేసేందుకు ఇష్టపడేవారు కాదని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతూ ఉంటారు.