ఈ తెలుగు సినిమాల‌ను హాలీవుడ్లో కాపీ కొట్టేశారు… అది తెలుగోడి టాలెంట్ అంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే చాలా సినిమాలు హాలీవుడ్ సినిమాల కథల నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెర‌కెక్కించినవై ఉంటాయి. అలాగే హాలీవుడ్ కథ‌ల నుంచి ఇన్స్పైర్ అయ్యి కథలు రాసుకునే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. పూర్తి హాలీవుడ్ సినిమాలను తెలుగులో తెరకెక్కించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో సర్వసాధారణం. కానీ మన తెలుగు సినిమాలను కూడా హాలీవుడ్ కాపీ కొట్టిందని చాలామందికి తెలియదు.

అలా హాలీవుడ్ వాళ్లు మన తెలుగు సినిమాలను కాపీ కొట్టి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అది తెలుగోడి టాలెంట్ అంటే..! ఇక మన తెలుగు సినిమాలు కాపీ కొట్టి హాలీవుడ్ వాళ్లు తీసిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. కమల్ హాసన్ హీరోగా నటించిన ” స్వాతిముత్యం “. ఈ సినిమా కథని సేమ్ టు సేమ్‌ ” ఫారెస్ట్ గంప్ ” అనే పేరుతో రిలీజ్ చేశారు.

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ” గులాబీ ” సినిమా కథను ” పోలి టేకెన్ ” సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నాయి. కానీ అది మన గులాబీ చిత్రం నుంచి తీసుకున్నాడంటే మాత్రం డైరెక్టర్ ఒప్పుకోడు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ” దార్ ” సినిమాని ” ఫియర్ “పేరుతో హాలీవుడ్లో తెర‌కెక్కించారు. అలాగే కమల్ హాసన్ నటించిన ” అభయ్ ” సినిమాని ” కిల్ బిల్ ” అనే పేరుతో పూర్తిస్థాయిలో కాపీ కొట్టేసి తెరకెక్కించాడు డైరెక్టర్ టారంటినో.

పై వచ్చిన కథలన్నీ మన తెలుగు సినిమా కథలను కాపీ కొట్టి తెరకెక్కించినవే. ఇక గోపీచంద్ హీరోగా నటించిన ” ఒక్కడున్నాడు ” సినిమా అయితే పూర్తి స్థాయిలో ప్రింట్ చేసి ” గెట్ ద గ్రింగో ” సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమా క‌థ తానేరాసినట్లుగా పేరు వేయించుకున్నాడు డైరెక్ట‌ర్. కానీ వీటి మూల కథలు తెలుగు అని ఎప్పుడు ఎవరు ప్రకటించలేదు. క్రెడిట్ కూడా ఇవ్వకుండా ఇలా హాలీవుడ్ వాళ్లు తెలుగు సినిమాలను ఓ రేంజ్ లో కాపీ కొట్టి రిలీజ్ చేశారు.