ర‌ష్మిక‌ను ప‌క్క‌కు తోసిప‌డేసిన శ్రీలీల‌… త‌ల‌బిరుసుకు తిక్క కుదిరిందిగా…!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు నేషనల్ క్రష్‌ రష్మిక, పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల. ఈ ఇద్దరు స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటూ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు. అంతేకాకుండా వీరి మధ్య కూడా విపరీతమైన పోటీ నడుస్తుంది. ప్రస్తుతం రష్మిక మందన్న‌ పుష్ప 2, యానిమల్, రెయిన్‌బో సినిమాల షూటింగ్‌ల్లో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక.. ఈ ఏడాది భీష్మ కాంబినేషన్ నితిన్ కు జోడిగా మరో సినిమాలో నటించబోతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ర‌ష్మిక‌ స్టార్ హీరోయిన్గా కొనసాగడంతో నితిన్ లాంటి చిన్న హీరోలతో చేయడం ఇష్టం లేదని బెట్టుపోతున్నట్లు తెలుస్తుంది. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చి లైఫ్ ఇచ్చిన స్టార్ హీరోను రిజెక్ట్ చేసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను రష్మిక రిజెక్ట్ చేసిన వెంటనే శ్రీ లీల‌ ఈ అవకాశాన్ని కొట్టేసిందట

ఆమె ఎంత బిజీగా ఉన్నా నితిన్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట‌. దీంతో ర‌ష్మిక ఇక‌నైనా త‌న త‌ల‌బిరుసు తగ్గించుకోకపోతే శ్రీలీల వరుస అవకాశాలను దక్కించుకొని స్టార్ హీరోయిన్గా మారిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే ప్లేస్‌లో శ్రీ లీల‌ ఛాన్స్ కొట్టేసింది. రష్మిక తర్వాత టాప్ హీరోయిన్గా శ్రీ‌లీల దూసుకువ‌స్తోంది.

ఈ ఏడాదిలో ఆదికేశవ, స్కంధ‌, భగవంత్ కేసరి, గుంటూరు కారం అలాగే విజయ్ దేవరకొండ సరసన కూడా శ్రీ‌లీల నటిస్తుంది. ఇవే కాకుండా శ్రీ‌లీలా మరో ఐదు సినిమాలలో నటిస్తోంది. గతంలో హీరో నితిన్ హీరోయిన్ రష్మిక మందన భీష్మ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వెంకి కుడుముల డైరెక్షన్లో వచ్చిన సినిమా సూపర్ హిట్గా నిలిచింది. రష్మిక – నితిన్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ఆశించిన ఫ్యాన్స్ కు ప్రాజెక్ట్ నుంచి రష్మిక తప్పుకోవడంతో నిరాశ ఎదురైంది.