టాలీవుడ్‌లో పెద్ద విల‌న్ అవ్వాల్సిన చిరంజీవి స్టార్ హీరో ఎలా అయ్యాడు… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డ్డ నిజం..!

టాలీవుడ్‌లో మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి. 150 పైగా సినిమాల్లో నటించి కోట్లాదిమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో చాలామంది టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి ఒక స్టార్ విలన్‌గా ఎదుగుతాడు అనుకునేవారట. అయితే చిరంజీవి వారు ఊహించుకున్న దానికి భిన్నంగా సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మెగాస్టార్ అయ్యారు.

ఈ విషయాల గురించి సీనియర్ హీరో మురళీమోహన్ మాట్లాడుతూ తాను సినిమాల్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే సమయంలో చిరంజీవి నెగటివ్ రోల్స్ లో నటించాడని.. ఆ టైంలో తాను ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ ఇస్తుండగా చిరంజీవి నా వద్దకు వచ్చి అన్నయ్య నేను ఎప్పటికైనా ఇలా ఆటోగ్రాఫ్స్ ఇచ్చే రేంజ్ కు ఎదుగుతానా ? అని అడిగాడట‌. దానికి మురళీమోహన్ నువ్వు ఎప్పటికైనా స్టార్ విలన్ అవుతావ‌ని చెప్పార‌ట‌.

ఇందుకు కార‌ణం కూడా ముర‌ళీమోహ‌న్ చెప్పారు. చిరంజీవికి కసిగా చూడగలిగే అతడి కళ్లే హైలెట్ అని చెప్పుకొచ్చాడు. ఆ రోజుల్లో చిరంజీవిపై అందరికీ ఉన్న ఏకాభిప్రాయం చిరంజీవి ఎప్పటికైనా ఒక స్టార్ విలన్ అవుతాడని అనుకునేవారట‌. కే. విశ్వనాథ్ కూడా ఈ మాట నాతో చెప్పారని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. చిరంజీవి కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉందని, కొత్తదనం కనిపిస్తుందని చెప్పార‌ట కే విశ్వనాథ్.

అందరిలా కాకుండా చిరంజీవి ఏదైనా ఫైట్ సీన్ వస్తే కొరియోగ్రాఫర్ చెప్పినట్టు కాకుండా ఇంకా బెటర్ గా చేయడానికి ట్రై చేసేవాడట. అలాగే ఏదైనా డాన్స్ సీన్లు ఉన్నా ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేవారట. అలా స్వ‌యంకృషితో ఎదిగిన చిరంజీవి ఎవరు అనుకొని రేంజ్‌కి ఎదిగి మెగాస్టార్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఈ విషయాల చెప్ప‌డం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు మురళి మోహన్.