మెగా వారసురాలి బారసాల.. ఇంతకీ ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరుపై స‌స్పెన్స్‌..!

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాసన దంపతులు రీసెంట్ గానే తల్లిదండ్రులగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగి 11 సంవత్సరాల అయిన తర్వాత ఈ బ్యూటిఫుల్ కపుల్ తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పారు. గత సంవత్సరం ప్రెగ్నెంట్ అయిన ఉపాసన ఈ నెల 20వ తేదీన అపోలో హాస్పిటల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

మెగా కుటుంబంలోకి ఈ బుల్లి మహాలక్ష్మి రావటంతో మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈరోజు రామ్ చరణ్- ఉపాసన కూతురికి బారసాల వేడుక జరిపించబోతున్నారట. ఈ బుల్లి మెగా వారసురాలు నేమింగ్ సెర్మినేకి సంబంధించి ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

ఈ బార‌సాల ఫంక్ష‌న్ ఏర్పాట్లు వీడియోని కూడా ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన డార్లింగ్ కు ఈరోజు పేరు పెట్టబోతున్నట్లు ఉపాసన అనౌన్స్ చేసింది. ఈ బుల్లి మెగా వారసురాల బార‌సాల వేడుక‌లో కొణిదల, కామినేని ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేయబోతుందట. అదేవిధంగా ఈ బుల్లి మహాలక్ష్మి పేరుని కూడా ఇప్పటికే ఖరారు చేశారు. ఈరోజు అఫీషియల్ గా ఆ పేరును అనౌన్స్ చేస్తారు.

మ‌రి రామ్ చ‌ర‌ణ్ కూతురి పేరేంటో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా ఉపాసనకు పుట్టేది అమ్మాయే అంటూ మొదటి నుంచి ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. ఇక అనుకున్నట్టుగానే ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఉపవాసన డెలివరీకి ఒక నెల ముందు నుంచి రామ్ చరణ్ తన సినిమా షూటింగ్లకు బ్రేక్ చెప్పగా ఈ కీలక సమయంలోనే తన భార్య ఉపాసన పక్కనే ఉంటూ రాంచరణ్ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.

అంతే కాదు డెలివరీ తర్వాత మరో రెండు మూడు నెలల పాటు ఆయన ఇంటికి పరిమితం అవుతానని కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక తన కూతురితో ఆనందం మధుర క్షణాలను గడపడానికి తాను నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను కూడా వాయిదా వేశారు. ఏది ఏమైనా ఈరోజు మెగా ప్రిన్సెస్ పేరు బయటకు రాబోతోంది.