టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల పరంపరలో ముందుగా వస్తోన్న సినిమా బ్రో. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తమిళంలో హిట్ అయిన వినోదయం సీతం రీమేక్ కావడంతో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న అంచనాలు ముందునుంచే ఉన్నాయి.
అవుట్ అండ్ అవుట్ మల్టీ స్టారర్ ఎంటర్టైర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు, నటుడు సముద్రఖని చాలా ఇష్టంతో డైరెక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సముద్రఖని ఈ స్టోరీని పవన్‌కు వినిపించిన వెంటనే పవన్ ఈ సినిమా చేసేందుకు అగ్రిమెంట్‌పై సైన్ చేసేశాడు. ఇక బ్రో అనే టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై హైప్ మరింతగా పెరిగింది.
ఈ బ్రో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ బ్రో సినిమా జూలై 28న గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. కాగా ఈ రోజు సాయంత్రం రిలీజ్ అయిన టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. పవన్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో అదే స్టైల్లో దింపేశారు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు త్రివిక్రమ్ మాటలు, పవన్ స్టైల్, మేనరిజమ్, సాయిధరమ్ తేజ్ స్టైలీష్ యాక్షన్, పవన్ చిలిపి కామెడీ అన్నీ బాగున్నాయి. ఏమాటకు ఆమాట టీజర్‌తోనే బొమ్మకు హిట్ కళ అయితే వచ్చేసింది. “కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం..” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలెట్. అలాగే సాయితేజ్‌తో సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా అంటూ చెప్పిన డైలాగ్ కూడా బాగుంది. ఇక టీజర్‌తోనే దుమ్మె లెగిసింది.. రేపు ట్రైలర్‌తో.. ఆ పై సినిమాతో థియేటర్లలో మోత మోగిపోనుంది.