విజయ్ దేవరకొండ – రష్మిక ఈ జంట పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటూ.. ఇద్దరూ కలిసి సీక్రెట్ గా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారంటూ.. తరచూ ఓకే రెస్టారెంట్లో కలిసి మాట్లాడుకుంటారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇప్పుటి వరకు వీరిద్దరిపై వస్తున్న ఈ వార్తలపై విజయ్ దేవరకొండ కానీ, రష్మిక కాని ఇద్దరిలో ఎవరు స్పందించలేదు.
వీరిద్దరు కలిసి గతంలో గీతాగోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఇందులో గీతాగోవిందం పెద్ద బ్లాక్బస్టర్ హిట్. డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఈ రెండు సినిమాల తర్వాత నుంచి వీరిద్దరి గురించి రకరకాల వార్తలు బాగా హైలెట్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే విజయ్ దేవరకొండ – రష్మిక త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని.. వీరి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పేసారంటూ.. వీరు త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారంటూ సమాచారం వినిపిస్తుంది. వచ్చే ఏడాదిలోనే వీరిద్దరి పెళ్లి కూడా జరగబోతుందట. ప్రస్తుతం వీరిద్దరు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే పెళ్లిపై వీరు స్పందిస్తారని కూడా గుసగుసలు నడుస్తున్నాయి.
ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో వారు స్పందిస్తే కాని తెలియదు. ఇదే కనుక నిజమైతే మరో క్రేజీ జంట వివాహ జీవితంలోకి అడుగుపెట్టినట్టే. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది ఫాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. కొంతమంది మాత్రం ఇవన్నీ పుకార్లు అంటూ కొట్టి పడేస్తున్నారు.