‘ లెజెండ్ ‘ లో బాల‌య్య‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ మిస్ అయిన స్టార్ హీరో…!

నందమూరి నటసింహ బాలకృష్ణ – బోయపాటి ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో ఎంత సూపర్ హిట్ కాంబినేషనో తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ కాంబినేషన్ లో మొదటి సినిమా సింహ తరువాత వచ్చిన సినిమానే లెజెండ్. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ ఎంతో అద్భుతం. ఈ సినిమాలో బాలయ్యకు గట్టి పోటీ ఇస్తూ విలన్ పాత్రలో జగపతిబాబు పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు.

జగపతిబాబుకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ తో విలన్ గా సెట్ అవుతాడా లేదా ? అని డౌట్ లేకుండా ఆయ‌న‌ను విలన్ గా చేసేందుకు బోయపాటి సాహసం చేశాడనే చెప్పాలి. జగపతిబాబు ఈ సినిమాలో నెవర్ బిఫోర్ రేంజ్ లో గట్టి పర్ఫామెన్స్ తో అదరగొట్టి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. అప్పటికే జగపతిబాబు క్రేజ్ టాలీవుడ్ లో ఏమాత్రం కనిపించేది కాదు. సినిమాలో హీరోగా అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జగపతిబాబు లెజెండ్ సినిమాతో చాలా గ్రాండ్‌గా సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాడు.

ప్రస్తుతం పాన్ ఇండియాలో లెవెల్ లో జగపతిబాబు క్రేజ్ కొనసాగుతుంది. లెజెండ్ సినిమా విలన్ రోల్ కి మొదటిగా బోయపాటి శ్రీను అనుకున్న హీరో జగపతిబాబు కాడ‌ట. ఈ విల‌న్ పాత్ర‌కు మొదట్లో కొంతమంది బాలీవుడ్ స్టార్ హీరోస్ అయితే ఎలా ? ఉంటుందని ఆలోచన చేసిన బోయపాటి .. ఆ త‌ర్వాత‌ యాంగ్రీ యంగ్ మ్యాన్‌ రాజశేఖర్‌ని ఈ పాత్ర కోసం అడిగి చూద్దాం అనుకున్నారట.

రాజశేఖర్ కు ఆ కథ వినిపించగా అప్పట్లో రాజశేఖర్ విలన్ పాత్రలు చేయడానికి సిద్ధంగా లేనని సున్నితంగా తిరస్కరించాడ‌ట. దీంతో తరువాత ఆలోచన జగపతిబాబుపై చేసిన బోయపాటి ఒకసారి బాలకృష్ణను అడిగి చూసాడ‌ట. బాలకృష్ణ కూడా మంచి ఆలోచన అడగమని చెప్పాడట. దీంతో ఈ అవకాశం జగపతిబాబుకు వెళ్ళింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజై 45 కోట్ల వ‌సుళ్ళు రాబ‌ట్టి తిరుగులేని హిట్ అయ్యింది.