నిఖిల్ ‘ స్పై ‘ ప్రి రిలీజ్ బిజినెస్.. హిట్ టాక్ వ‌స్తే రికార్డులు బ్రేకింగ్‌… షేకింగ్‌…!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో స్టార్ హీరోలకి దడ పుట్టిస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన కార్తికేయ 2 సినిమాతో తన కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత వచ్చిన 18పేజ‌స్‌ సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాల తర్వాత నిఖిల్ క్రేజ్‌ భారీగా పెరిగింది. ప్రస్తుతం మూడు పాన్ ఇండియా సినిమాలకు నిఖిల్ ఓకే చెప్పాడు.

ప్రస్తుతం భారత‌ స్వాతంత్ర సమయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణానికి గల కారణానికి తెలియజేస్తూ తెరకెక్కిన యాక్షన్ సినిమా స్పై. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకు ముందుకు రానుంది. ఇప్పటికే ప్రేక్షకులు ముందుకు వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇదే సమయంలో ఈ సినిమా బిజినెస్ ఎవరు ఊహించిన రీతిలో జరుగుతోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు స్పై తెలుగు వెర్షన్ థియేట్రిక‌ల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు రూ.13 నుంచి రూ.14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందట. మిగిలిన ఏరియాలో కలిపి మొత్తంగా రూ.16 నుంచి రూ.15 కోట్లు బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.17 కోట్లు దాటితే బ్రేక్ ఈవెన్ అయినట్లే. మిగిలిన భాషల్లో బిజినెస్ లెక్కలు మాత్రం ఇంకా బయటికి రాలేదు.

భారీ రేంజ్‌లో ఈ సినిమాపై అంచనాలు ఉండటంతో ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం అయితే మాత్రం ఈజీగానే టార్గెట్‌ను అందుకుని మంచి లాభాలు ఇస్తుందని అందరూ నమ్ముతున్నారు. అదే పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ టాక్ వ‌స్తే ఇక స్పై రికార్డులు షేకింగ్ ఖాయ‌మే..!