ఆ డిజాస్ట‌ర్ సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ OG కు లింక్ ఉందా…. సుజీత్ అస‌లు ఏం తీస్తున్నాడు…!

23 ఏళ్ల వయసులోనే రన్ రాజా రన్ వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కుర్ర డైరెక్టర్ సుజిత్. ఈ సినిమా చూశాక ప్రభాస్ బాగా ఫిదా అయిపోయి బాహుబలి తర్వాత అతనితోనే మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. సుజిత్ ప్రతిభను ప్రభాస్ గుడ్డిగా నమ్మేశాడు కానీ ఈ డైరెక్టర్‌తో కలిసి తీసిన సాహో ఫ్లాప్ అయ్యింది. సుజిత్ ప్రభాస్ రేంజ్‌కి తగినట్లు ఉండాలనే ఉద్దేశంతో క్యాస్టింగ్ విషయంలో చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయాడు. జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడి, అర్జున్ విజయ్ ఇలా స్టార్ యాక్టర్లందరినీ ఎంపిక చేసుకున్నాడు.

ఎంతమంది బడా యాక్టర్లు ఉన్నా సినిమా కథలో బలం లేకపోవడంతో మూవీ ఎదురు తన్నింది. సాహో దెబ్బకు సుజిత్‌తో కలిసి పని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో OG సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమా విషయంలోనూ సాహో బాటనే పట్టాడు సుజిత్. అంటే OG సినిమా కోసం కూడా అతడు బడా నటీనటులను ఆన్ బోర్డు చేస్తున్నాడు.

ఇప్పటికే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్‌లను సెలెక్ట్ చేసుకున్నాడు. విలన్‌గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మిని రంగంలోకి దింపాడు. నిజానికి ఒక్క క్యాస్టింగ్ విషయంలో గొప్పగా ఉంటే చాలదు, సినిమా కథ బాగుండాలి, దానిని చెప్పే విధానం కూడా గొప్పగా ఉండాలి. అలాగే తీసుకున్న ప్రతి యాక్టర్‌కి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. లేకుంటే సినిమా ఫ్లాప్ అయ్యి నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది.

మరి సాహోలో చేసిన తప్పులను సరిదిద్దుకొని సుజిత్ OG సినిమాలో జాగ్రత్తలు తీసుకుంటాడా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఓజీ కథ పవన్ కళ్యాణ్‌కి తెగ నచ్చేసిందట. అందుకే ఏం ఆలోచించకుండా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మూవీలో పవన్ గాంధీ అనే ఓ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే సుజిత్ దశాదిశా తిరిగిపోతుంది.