తమన్నాతో గాఢంగా రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన‌ విరాట్‌ కోహ్లీ.. మనోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

ఈ రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమన్నా పేరు ఒక్కసారిగా వైరల్ గా మారింది. ప్రధాన కారణం తమన్నా బాలీవుడ్ స్టార్ నటుడు విజయ్‌వర్మతో డేటింగ్ చేస్తుందన్న వార్తలతో ఈమె పేరు వైరల్ గా మారింది. ఇదే సమయంలో తమన్నా- విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఇద్ద‌రు కలిసి ఓ యాడ్ లో నటించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ సమయం నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి.

కాగా ఇప్పుడు తాజాగా వాటికి సంబంధించిన ఒకప్పటి ఆ యాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఆ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్లు ఎంతో డిఫరెంట్గా స్పందిస్తున్నారు. ఇక అసలు ఆ వీడియోలో ఏముందంటే కోహ్లీ తమన్నాని ఎలా లవ్‌లో పడేయాలని తన స్నేహితుల ముందు తన ఫోన్ దాచిపెట్టి తమన్నా వద్దకు వెళ్లి నా ఫోన్ పోయింది మిస్సిడ్ కాల్ ఇవ్వండి అని అడుగుతాడు. తమన్నా మీ నెంబర్ చెప్పండి అని అంటుంది.

ఇక అప్పుడు కోహ్లీ ఫోన్ నెంబర్ చెప్పగా కాల్ చేయడంతో ఫోన్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత ఈ నెంబర్ మీదేనా సేవ్ చేసుకుంటాను మీ పేరు ఏమిటి అని కోహ్లీ అడగగా తమన్నా అంటుంది. ఆ తర్వాత కోహ్లీ రొమాంటిక్‌గా తమన్నాను తన మాయలో పడేస్తాడు. ఇక దీంతో కోహ్లీ ఈ యాడ్ ను అడ్డం పెట్టుకుని తమన్నాతో అదిరిపోయే రొమాన్స్ చేస్తూ ఆడ్డంగా ఇరుక్కుపోయాడంటూ కామెంట్లు వినిపించాయి. ఇక అలాగే మరికొందరు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమో, వీరి బంధం బాగా దూరం వెళ్లినట్లు ఉంది అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. గతంలో తమన్నా- కోహ్లీ నటించిన ఈ యాడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది..!!