మెగాడాట‌ర్‌కు దూల‌తీరిపోయే ఆన్స‌ర్ ఇచ్చిన మాజీ మొగుడు.. క‌ళ్యాణ్ కౌంట‌ర్ అదుర్స్‌…!

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎప్పుడు వార్తల్లో ఉంటూ వస్తుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందే ఆమె ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఒక కూతురు పుట్టాక మనస్పర్ధలతో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత చిరంజీవి ఫ్యామిలీ మళ్ళీ శ్రీజకు చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి జరిపించారు. మళ్లీ ఈ దంపతులకు కూడా ఒక కూతురు పుట్టాక మనస్పర్ధలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు.

దాదాపు రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంటకు అధికారికంగా విడాకులు మంజూరు కావడమే మిగిలి ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌కు మెగా అల్లుడు కళ్యాణ్ రాలేదు. దీంతో వీరిద్దరు విడాకులు దాదాపు అధికారికమే అంటున్నారు.

తాజాగా ఈరోజు ఫాదర్స్ డే కావడంతో కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అలాగే ప్రతి వారం ఎంతో ప్రత్యేకమైన నాలుగు గంటలు గడుపుతాను.. కూతుర్లు చాలా బెస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అది చూసిన నెటిజన్లు వారంలో నాలుగు గంటలు మాత్రమే హ్యాపీగా గడుపుతానని చెప్పడం ద్వారా.. కూతురుతో ఉన్నప్పుడు మాత్రమే తాను సంతోషంగా ఉంటున్నాను అని చెప్పకనే చెప్పేశాడంటున్నారు.

ఈ క్యాప్ష‌న్ ఇన్ డైరెక్ట్ గా శ్రీజకు కౌంటర్ ఇవ్వడంతో పాటు.. తమ విడాకులపై దాదాపు అధికారిక ప్రకటన ఇచ్చేసాడని సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ‌ జరుగుతోంది. ఈ కౌంట‌ర్ అయితే శ్రీజ‌కు గ‌ట్టిగానే త‌గిలిందంటున్నారు. మరి దీనిపై శ్రీజ నుంచి ఎలాంటి రిటాక్ట్‌ ఉంటుందో ? చూడాలి.