న‌రేష్ – ప‌విత్ర మ‌ధ్య అస‌లు ఏజ్ గ్యాప్ ఎంత‌… ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తోన్న కొత్త న్యూస్‌…?

ప్ర‌స్తుతం తెలుగు మీడియాతో పాటు తెలుగు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ – పవిత్ర లోకేష్ పేరు ఒక రేంజ్‌లో మార్మోగిపోతుంది. గ‌త యేడాదిన్న‌ర కాలంగా వీరిద్ద‌రు కూడా ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉన్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ పుట్ట‌డంతో పాటు త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు భార్య‌భ‌ర్త‌లు కూడా కాబోతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ లేటు వ‌య‌స్సులో కూడా వీరిద్ద‌రు కుర్ర లవర్స్ ల బిహేవ్ చేస్తూ పిచ్చ‌పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తున్నారు.

దీంతో వీరిద్ద‌రి గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇక వీరిద్ద‌రి ప్రేమ అస‌లు ఎక్క‌డ ? చిగురించింది ? అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌. ఇప్ప‌టికే న‌రేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తితో విబేధాలు రావ‌డంతో న‌రేష్ ఆమెకు దూరంగా ఉంటూ ప‌విత్రా లోకేష్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు.

ఇక ఇటు ప‌విత్ర‌కు కూడా రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చాక పవిత్రకు 2000లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన సుచేంద్రప్రసాద్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు.

ఇక న‌రేష్‌, ప‌విత్ర మ‌ధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువే. నరేష్ వయసు 62 సంవత్సరాలు కాగా… పవిత్ర లోకేష్ వయస్సు 43. వీరి మధ్య 19 సంవత్సరాల ఏజ్ గ్యాప్ న‌డుస్తోంది. ఏదేమైనా ఇది చాలా ఎక్కువ గ్యాప్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.