మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మనందరికీ సుపరిచితురాలే. శ్రీజ ఇండస్ట్రీ పరంగా పరిచయం కానప్పటికీ ఒక స్టార్ సెలబ్రిటీ కూతురుగా అందరికీ తెలుసు. అయితే శ్రీజ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలోని ఈవెంట్స్‌లో పాల్గొంటూ సందడి చెయ్యడం వల్ల శ్రీజ అందరి దృష్టిలో పడుతుంది.
గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి ఇంటి నుంచి పారిపోయి అతన్ని పెళ్లి చేసుకుని వార్తలోకెక్కింది. శ్రీజ పారిపోయి పెళ్లి చేసుకున్న సమయంలో చిరంజీవి కుటుంబంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.
కూతుర్ని పెంచడం చిరంజీవికి సరిగ్గా రాలేదంటూ చాలామంది ఫైర్ అయ్యారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా చిరంజీవి శ్రీజను దగ్గరికి తీసుకుని ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాడు. ఆ తరువాత శ్రీజకి తన మొదటి భర్త ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శ్రీజ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. దాని తర్వాత చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండో వివాహం చేయించాడు. ఇక రెండో భర్త ద్వారా కూడా ఒక కూతురికి జన్మనిచ్చింది శ్రీజ. శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి హీరోగా మంచి గుర్తింపు ఉంది. కానీ అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. అలానే శ్రీజతో కొన్ని విబేధాలు రావడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారని ఈ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి.
కళ్యాణ్ కూడా మెగా ఫ్యామిలీలో జరిగే ఏ ఫంక్షన్స్ లో కనిపించకపోవడంతో నిజంగానే వారిద్దరూ విడిపోయారని మెగా అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. అలా ఇద్దరు భర్తలకు దూరమైనా శ్రీజ ఎలాంటి బాధ లేకుండా తన ఇద్దరు కూతుర్లతో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లైఫ్‌కి సంబందించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీజ ఒక వీడియోని సోషల్ మీడియా అభిమానులతో షేర్ చేసుకుంది.
ఆ వీడియోలో శ్రీజ తన చిన్న కూతురుని ఎత్తుకొని వర్క్ అవుట్ చేస్తూ కనపడుతుంది. ఆ వీడియో చూసిన కొంతమంది శ్రీజని ప్రశంసిస్తుంటే మరి కొంతమంది ఏమో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఒకరు మాత్రం ‘శ్రీజ చాలా అదృష్టవంతురాలు. భర్తను వదిలేసి తన తండ్రి సంపాదనతో బాగా ఎంజాయ్ చేస్తుంది’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం శ్రీజ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.