ఐశ్వ‌ర్యారాయ్ వెన‌క ఉన్న గ్రూప్ డ్యాన్స‌ర్ ఇప్పుడో స్టార్ హీరో… ఎవ‌రో గుర్తు ప‌ట్టారా ?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాయ్. ఆమె నటించిన ఒక సినిమాలో ఐశ్వర్యరాయ్ వెనుక ఉన్న గ్రూప్ డాన్సర్ ఇప్పుడు స్టార్ హీరో. ఇంతకీ ఎవరా స్టార్ హీరో గుర్తుపట్టారా..? అందాల తార ఐశ్వర్యారాయ్ నటించిన తాల్ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా వినిపిస్తూనే ఉన్నాయి.

BazaarUK on Twitter: "Indian actress Aishwarya Rai is our beauty muse today  - here's why http://t.co/Ulsx4jFsYA #Cannes2015 http://t.co/sHvHf38e8S" /  Twitter

అందులో కహీన్ ఆగ్ లగే లాగ్ జాయే అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో ఒక స్టార్ హీరో డాన్సర్ గా చేశాడు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా హీరో గుర్తుపట్టారా..? 2003లో ఇష్క్ విష్క్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షాహిద్ కపూర్ సినిమాలో హీరోగా నటించక ముందు చాలా సినిమాల్లో గ్రూప్ డాన్సర్ గా చేశాడు. అలా ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ సినిమాలో ఓ సాంగ్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా చేసాడు షాహిద్. అయితే ప్ర‌స్తుతం ఆలీ అబ్బాస్ జాఫర్ డైరెక్టర్ గా షాహిద్ కపూర్ హీరోగా బ్లడీ డాడీ అనే సినిమా లో నటించాడు.

ఈ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాహిద్ కపూర్ స్వయంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కెరియర్ లో చాలా కష్టాలు అనుభవించానని ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కూడా చేశానంటు చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న బ్లడీ డాడీ సినిమా 2011 లో వచ్చిన ఫ్రెండ్స్ మూవీస్ చిత్రానికి అడాప్షన్ గా రానుంది. ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ జియో సినిమాస్ రిలీజ్ చేయనున్నాయి.

HTCityCheers23 | Shahid Kapoor: I can't even relate to my 23-yr-old self |  Bollywood - Hindustan Times