కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీడేట్ అంటూ ఏమీ ఉండదూ. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటాయి. స్టోరీగాని, స్క్రీన్‌ప్లే గాని ఫ్రెష్‌గా ఉండి.. రెండున్నర గంటలు ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. అసలు అలాంటి ఆలోచన దర్శకుడికి ఎలా కలిగింది? నటీనటులు అంత గొప్పగా ఎలా యాక్టింగ్ చేశారు? అని ఎన్నో రకాల ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గజిని’ కూడా ఒకటి.
మతి మరుపు అనే కాన్సెప్ట్‌తో కమర్షియల్ సినిమా తీసి బ్లాక్బాస్టర్ కోట్టచ్చు అని ఏ.ఆర్ మురుగుదాస్ నిరూపించాడు. ఇది పేరుకు రీమేక్ సినిమా అయిన మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి మురుగుదాస్ ఒక మంచి సినిమాని మనకి అందించాడు. ఈ సినిమాలో సూర్య నటన వర్ణనాతీతం. సంజయ్ రామస్వామి పాత్రలో నటించాడు అనడం కంటే జీవించేశాడు అనడం సబబు. ఈ సినిమాతో సూర్యకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
అంతేకాకుండా టాలీవుడ్ సినిమాలకు సమానంగా ‘గజిని’ మూవీ ఇక్కడ వసూళ్ళను సాధించింది. హాసిన్, నయనతార తమ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక హారిస్ జయరాజ్ సంగీతం అయితే మరో లెవల్. అసలు సినిమాపై ఇంత బజ్ ఏర్పడడానికి ముఖ్య కారణం హారిస్ జయరాజ్ పాటలే. 2005లో విడుదలైన ఈ సినిమా రూ.50 కోట్ల కలెక్షన్లను సాధించి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఇంతటి బ్లాక్ బాస్టర్ సినిమాను ఓ టాలీవుడ్ స్టార్ హీరో రిజెక్ట్ చేశారట.
ఇక గజినీ సినిమా బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కింది. ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. గజిని సినిమాకి మొదటి ఛాయిస్ సూర్య కాదట.. సూర్య కంటే ముందే తెలుగులో పలువురు స్టార్ హీరోల వద్దకు ఈ సినిమా కథ వచ్చింది. ఇక ఆ హీరోల లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు.. సూర్య కంటే ముందే గజినీ కథ మొత్తం మహేష్ బాబు విన్నాడు.
గజినీ స్టోరీ మహేష్ కు ఎంతగానో నచ్చింది. కానీ ఈ సినిమాను ఎంతో సున్నితంగా తిరస్కరించాడు మహేష్. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలో హీరో గుండులో కనిపించాల్సి ఉంటుంది.. మహేష్ బాబు టాలీవుడ్ లో ప్రిన్స్.. ఆడవారి కలల రాకుమారుడు.. అలాంటి మహేష్ బాబు జుట్టు లేకుండా కనిపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరని ఒక చిన్న సాకుతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా మహేష్ ఓ భారీ బ్లాక్ బస్టర్ ను మిస్ అయ్యాడు.