టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నట వారసుడిగా తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్ లోనే స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ అల్లు వారసుడు. ఇక గత ఏడాది టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా హీరోగా మారాడు.
ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వల్ గా వస్తున్న పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఏ దర్శకుడు తో సినిమా చేస్తారు అనేది ఇప్పటివరకు ఇలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ వార్త వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ చేయబోయే తన తర్వాత సినిమాలో ఓ ఐరన్ లేగ్ హీరోయిన్ కి అవకాశం ఇవ్వొతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతకీ అల్లు అర్జున్ అవకాశం ఇవ్వబోయే ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం.
అల్లు అర్జున్ తన సినిమా హిట్ అయిన ప్లాప్ అయినా తనతో పాటు నటించిన నటీనటులు హీరోయిన్ల టాలెంట్ చూసి ఆయన తర్వాత సినిమాల్లో అవకాశం ఇస్తాడు. ఈ విధంగా చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలామంది హీరోయిన్లకు వారి టాలెంట్ చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చాడు.. ఇదే సమయంలో అల్లు అర్జున్‌కి లక్కీ హీరోయిన్గా ఉన్న పూజ హెగ్డే పరిస్థితి ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఎటు కాకుండా పోయింది.
అల్లు అర్జున్ కు జంటగా దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురం సినిమాలలో హీరోయిన్గా నటించిన పూజ.. దువ్వాడ జగన్నాథం సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. ఇక అలా వైకుంఠపురం మాత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాల తర్వాత పూజ నటించిన బీస్ట్, రాధే శ్యామ్, ఆచార్య వంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలి పోవడంతో ఈ హీరోయిన్ కు ఐరన్ లాగ్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది.
అలాంటి పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ఎలాంటి ఆఫర్స్ లేవనే చెప్పవచ్చు.. కేవలం మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమాలో మాత్రమే ఈమె నటిస్తుంది.
ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ ప్లాఫ్ హీరోయిన్ కి తన తర్వాత సినిమాల అల్లు అర్జున్ అవకాశం ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ కు పూజ హెగ్డే ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.