ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్‌గా కీర్తి గడించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. తెలుగు సినిమాల్లో బాల నటి నుంచి ఎదిగి.. హీరోయిన్ స్థాయిని అందుకున్న శ్రీదేవి.. తర్వాత.. ఉత్తరాది సినిమాలకు.. తర్వాత పాన్ ఇండియా సినిమాలకు చేరి.. తన పేరును చిరస్థాయిగా నిలుపుకొంది. అయితే.. అసలు శ్రీదేవి గురించి తెలిసిన వారు.. ఆమె నటన గురించి మెచ్చుకునేవారు.. ఒక విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండరు.
అదే.. అంతర్జాతీయ ఖ్యాతి. రెండు సినిమాల్లో వచ్చిన ఆఫర్లను శ్రీదేవి వదులు కోవడంతో ఆమెకు ఇంట ర్నేషనల్.. అంటే హాలీవుడ్ పేరు రాకుండా పోయిందని అంటారు. తొలినాళ్లలో ఆమెకు స్పిల్ బర్గ్ నుంచి అవకాశం దక్కింది. ఆయన తీసిన జురాసిక్ పార్క్ సినిమా ఎంత హిట్లో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా.. లక్షల కోట్ల రూపాయలు రాబట్టింది. అలాంటి సినిమాలో శ్రీదేవికి అవకాశం వచ్చింది.
కానీ, షెడ్యూల్ ఇవ్వలేక.. కాల్‌షీట్లు లేక శ్రీదేవి ఒప్పుకోలేదు. పైగా.. ఆమె ఈ సినిమాను జంగిల్ మూవీగా పేర్కొని తక్కువ అంచనా వేసుకున్నారట. కానీ, సినిమా విడుదలై.. హిట్ అయ్యాక.. కొన్ని రోజుల పాటు.. ఆమె మానసికంగా ఆవేదన చెందారని అంటారు. అదేసమయంలో దర్శక దిగ్గజం.. రాజమౌళి తీసిన సినిమా.. బాహుబలి. ఈ సినిమాలో బాహుబలికి అమ్మ పాత్రలో నటించిన రమ్యకృష్ణకు ఎంతో పేరు వచ్చింది.
ఏపీ నుంచి ఉత్తరాది వరకు ప్రపంచ దేశాల దాకా.. ఎంతో పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో తొలి సారి అమ్మగా నటించేందుకు రాజమౌళి.. శ్రీదేవినే సంప్రదించారు. అయితే.. ఆమె ఈ సినిమాకు ఒప్పుకొన్నా.. ఆమె పెట్టిన కండిషన్లు నచ్చక.. వద్దనుకున్నామని.. రాజమౌళి చెప్పారు. తర్వాత మోహన్‌బాబు కుమార్తె ను కూడా అనుకున్నారు. ఆమె వద్దన్నారు. తర్వాత.. చివరకు రమ్యకృష్ణకు అవకాశం దక్కింది. అయితే.. శ్రీదేవి కనుక.. ఈ రెండు సినిమాలను వద్దనకుండా చేసి ఉంటే.. ఆమె రేంజ్ హాలీవుడ్ వరకు పాకేదని అంటారు.