విరాట్ కోహ్లీ బ‌య‌ట కింగ్‌… ఇంట్లో అనుష్క ముందు పిల్లే… ఇంత‌క‌న్నా ఫ్రూఫ్ కావాలా…(వీడియో)

ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబి లీగ్ ద‌శ‌కే పరిమితమైంది. సీజన్లో కొన్ని మంచి విజయాలు అందుకున్నా క్వాలీఫ‌య‌ర్‌కు చేరాలంటే ఖచ్చితంగా గెలవలసిన మ్యాచ్లో చేతులెత్తేసింది. దీంతో ఎలాగైనా ఈసారి టైటిల్ సాధించాలన్న కోరిక ఆ జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఇక విరాట్ కోహ్లీ మళ్లీ టీమిండియా తరఫున వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడిందుకు రెడీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో లండన్‌కు వెళ్లిన కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్యూటిఫుల్ డే అంటూ స్టోరీ షేర్ చేశాడు.

ఇక బయట ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అందుకే బయట అందరూ విరాట్ కోహ్లీని కోహ్లీ కింగ్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. కోహ్లీ బయట ఎంత పెద్ద పులి అయినా ఇంట్లో భార్య అనుష్కశర్మ ముందు మాత్రం పిల్లిలా ఉంటాడా ? అన్న సందేహాలు వస్తున్నాయి. అనుష్క శర్మ తాజాగా అందరి ముందు కోహ్లీని టీజ్ చేయటం ఆసక్తి కలిగించింది. కోహ్లీ లండన్ కు వెళ్లడానికి ముందు భార్యతో కలిసి ఫుమా కంపెనీ ఈవెంట్లో పాల్గొన్నారు.

యాంక‌ర్ కోహ్లీ సెలబ్రేషన్స్ ని ఇమిటేట్ చేసి చూపించమని అనుష్క‌ను అని అడిగాడు. అవతల జట్టు వికెట్ పడినప్పుడు కోహ్లీ ఎలా ? బిహేవ్ చేస్తాడో అనుష్క ఉన్నది ఉన్నట్టుగా చేసి చూపించింది. ఇది చూసిన కోహ్లీ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు. చెప్పాలంటే ఈ ఈవెంట్లో అందరి ముందు విరాట్ కోహ్లీని అనుష్క ర్యాగింగ్ చేసింది. ఇది చూడటానికి చాలా ఫన్నీగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది.

ఆ తర్వాత కోహ్లీ అనుష్క నటించిన బాండ్ బాజా బ‌రాత్ సినిమాలోని రణవీర్ సింగ్ డైలాగులు చెప్పి అందరిని నవ్వించాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.