టాలీవుడ్ లో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, సీనియర్ హీరోయిన్ టబు మధ్య ఎఫైర్ వార్తలు అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరూ కలిసి తొలిసారిగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆవిడా మా ఆవిడే సినిమాలో మరోసారి జోడి కట్టారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అప్పటినుంచి నాగార్జున – టబు మధ్య ఘాటు ఎఫైర్ ఉందని టాలీవుడ్ లో బాగా ప్రచారం జరిగింది. టబు ఐదున్నర పదుల వయసుకు చేరువైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నాగార్జునపై ఉన్న ప్రేమే కారణమని అంటారు.
తన జీవితం నాగార్జునకు అంకితం అయిపోవాలని టబూ ఇప్పటికి పెళ్లికి దూరంగా ఉందని చెబుతూ ఉంటారు. కేవలం నాగ్‌ను వదలటం ఇష్టం లేకే టబు హైదరాబాదులో ఉంటుంది అట. ఆమె ఉంటున్న ఇంటితోపాటు ఆమె మెయింటినెన్స్ అంతా నాగార్జున చూస్తాడు అన్న గుసగుసలు ఇప్పటికీ టాలీవుడ్ లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే టబు నాగార్జునతో మాత్రమే కాకుండా మరో బాలీవుడ్ నటుడుతోను ఎఫైర్ పెట్టుకుంది. 1995 నుంచి ఐదేళ్లపాటు నాగార్జునతో ఎఫైర్ నడిపిన టబు 2000 తర్వాత బాలీవుడ్లో ఛాన్సులు కోసం ట్రై చేసింది.
ఆ సమయంలో ప్రముఖ నటుడు మనోజ్ వాజ్‌పేయ్ – టబు ఏకంగా ఏడాదిలో మూడు సినిమాలలో జోడి కట్టారు. అప్పట్లో ఈ సినిమాలలో వీరిద్దరి రొమాన్స్ శృతిమించిందన్న టాక్ బాలీవుడ్ లో వినిపించింది. కేవలం టబు మీద వ్యామోహంతోనే మనోజ్ ఆమెకు తన సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు ఇప్పించాడని బీటౌన్ జనాలు చెప్పుకునేవారు. అలా కొద్ది రోజులపాటు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలారు
ఆ తర్వాత మనోజ్ విలన్ పాత్రలు వేయటం ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కొమరం పులి సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ విలన్‌గా నటించాడు. టబు ఆ తర్వాత బీ టౌన్ నుంచి తిరిగి వచ్చి హైదరాబాదులోనే స్థిరపడిపోయింది. ఇక అల వైకుంఠపురంలో సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టబూ అదిరిపోయే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.