సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాక ఎలాంటి రోల్స్ అయినా చేయగలగాలి . కొన్నిసార్లు హీరోయిన్గా ..మరికొన్నిసార్లు తల్లిగా.. మరి కొన్నిసార్లు ఆంటీగా ఎలాంటి పాత్ర ని అయినా చేయగలిగితేనే ఇండస్ట్రీలో నెట్టుకు రాగలరు . కేవలం హీరోయిన్ పాత్రలకే కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలకు కూడా సై అంటున్నారు అమ్మాయిలు. మరి ముఖ్యంగా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలిగి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి రోల్స్నైనా చేయడానికి సిద్ధపడుతున్నారు.
తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ జెనీలియా. తెలుగులో ఎలాంటి సినిమాల్లో నటించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న జెనీలియా తో హిట్లు ఫ్లాపులు అనే సంబంధం లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ వెళ్లింది. మరీ ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ పెట్టేసిన జెనీలియా ..రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నా సరే ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది .
ఈ క్రమంలోనే ఒకప్పుడు తెలుగులో చరణ్ తో నటించిన జెనీలియా ..ఇప్పుడు ఆయనకు ఏకంగా అమ్మగా చేయడానికి కూడా సిద్ధపడిందట . జెనీలియా – చరణ్ హీరో హీరోయిన్లు నటించిన సినిమా ఆరెంజ్ . అఫ్ కోర్స్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది . కానీ చాలామంది జనాలకు ఫేవరెట్ మూవీ అయిపోయింది. ఈ సినిమాలో జెనీలియా – చరణ్ రొమాన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయింది . అయితే ప్రెసెంట్ జెనీలియా – చరణ్ కు అమ్మగా చేయడానికి ఫిక్స్ అయిందన్న న్యూస్ వైరల్ అవుతుంది .
బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో చిన్నప్పటి చరణ్ పాత్రకు అమ్మగా నటించబోతుందట జెనీలియా . దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోతున్నారు . పెళ్లయినా.. పిల్లలు పుట్టిన.. ఫిజిక్ ఏం మారలేదు.. మరి అలాంటి నువ్వు ఎందుకు చరణ్ కి అమ్మ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నావు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం అంటూ లైట్ గా తీసుకుంటున్నారు..!!