26వ తేదీన రాజధాని ఏర్పాటుపై హైపవర్‌ కమిటీ నిర్ణయం!

ఏపీ రాజధాని ఏర్పాటుపై నియమించిన హైపవర్‌ కమిటీ ఈ నెల 26వ తేదీన తుది నిర్ణయం తీసుకోనున్నది. రాజధాని ఏర్పాటు తదిత అంశాలను కీలక నిర్ణయాలను వెల్లడించనుంది. తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో శనివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. జీఎస్జీ రావు, బోస్టన్‌ కమిటీ నివేదికలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం ఈ నెల 26 తేదీన రాజధాని ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవలే మూడోసారి సమావేశమైన హైపవర్‌కమిటీ పలు నిర్ణయాలను తీసుకుంది. రాజధాని ప్రాంత రైతుల నేపథ్యంలో పలు అంశాలపై చర్చించింది. అభ్యంతరాలను, సందేహాలను నేరుగా రాతపూర్వకంగానైనా, మెయిల్స్‌ ద్వారానైనా తెలుపుకోనేందుకు రైతులకు 17వ తేదీ వరకూ అవకాశాన్ని ఇచ్చింది.

తాజా సమావేశంలో ఆ అభిపాయ్రాలపైనా కమిటీ చర్చించినట్లు సమాచారం. అదే విధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం చేయడం దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. 2014కు ముందు రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులెవరు? ఆ తరువాత కొత్తగా వచ్చిన వారెవరు? అన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. జగన్‌తో సమావేశం అనంతరం మంత్రులు బొత్స, కన్నబాబు మాట్లాడుతూ.. అమరావతిలో 25శాతం పూర్తయిన భవనాల పనులన్నింటినీ పూర్తి చేస్తామని ప్రకటించారు. 13 జిల్లాలోపాటుగా అమరావతిని కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని జగన్‌ వెల్లడించారు.

Tags: capital amaravathi, cm jaganmohanreddy, high power comitee meeting