సీబీఐ రూపంలో జ‌గ‌న్‌కు కొత్త చిక్కు..ఏం జ‌రిగిందంటే..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సీబీఐ రూపంలో మ‌రో కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై ఆస్తుల కేసులు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ఆయ‌న‌పై విచారించి సీబీఐ మొత్తం 11 చార్జ్ షీటులు సీబీఐ కోర్టులో దాఖ‌లు చేసింది. అంటే ఒక్కొక్క చార్జ్ షీట్‌ను విడివిడిగా విచారించి.. ఒక్కొక్క దానికీ శిక్ష విధించాల‌నేది సీబీఐ వాద‌న‌. అయితే, అన్నీ క‌లిపి సీబీఐ భావిస్తున్న‌ట్టు  ఇది ఆర్థిక నేర‌మే కాబ‌ట్టి.. అన్నింటినీ క‌లిపి ఒకే కేసుగా విచారించాల‌నేది జ‌గ‌న్ వాద‌న‌.

ఈ మేర‌కు ఆయ‌న గ‌తంలోనే కోర్టుకు అప్పీల్ చేశారు. తాజాగా జ‌గ‌న్ పిటిష‌న్‌పై హైద‌రాబాద్‌లోని సీబీఐ కోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదిస్తూ.. 11 చార్జ్ షీట్‌ల‌కు సంబంధించి ఒకే కేసుగా ప‌రిగ‌ణిం చి ఒకే స‌మ‌యంలో విచారించే ప‌రిస్థితి లేద‌ని, ఇది సాధ్యం కాద‌ని కేసు మొత్తంగా ఆర్థిక విష‌యానికి సం బంధించి ఒక‌టే అయినా.. దీనిలోని నేరాల తీవ్ర‌త‌, స్థాయి, వ్య‌క్తులు వంటి విష‌యాలు చాలా తేడా ఉన్నాయ‌ని కాబ‌ట్టి వీట‌న్నింటినీ ఒకే గాట‌న క‌ట్టే ప‌రిస్థితి లేద‌న‌ని సీబీఐ వాదించింది.

అదే స‌మ‌యంలో సీబీఐ ప్ర‌త్యేక విష‌యాన్ని కోర్టుకు విన్న‌వించింది. బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్‌యాద‌వ్‌పై నమోదైన గ‌డ్డి కుంభ‌కోణం కేసులోనూ  ఒకే కేసేకు సంబంధించి అనేక చార్జ్ షీట్లు న‌మోదైనా.. అన్నింటినీ విడివిడిగానే విచారించార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు జ‌గ‌న్ కేసులోనూ ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం క్విడ్ ప్రొకో కేసులో ఏ1గా జ గ‌న్‌, ఏ2గా విజ‌య‌సాయి రెడ్డి ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే,  ఈ కేసుల్లోనే అనేక ఆరోప‌ణ‌లు ఎదు ర్కొన్న ప‌లువురు ఐఏఎస్ అధికారులు బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు సీబీఐ సీ ఆర్ పీసీ సెక్ష‌న్ 212 ప్రకారం కూడా వాదించ‌డంతో జ‌గ‌న్ కేసులో 11 చార్జ్ షీట్ల‌పైనా వేర్వేరుగానే విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం అటు న్యాయ‌ప‌రంగానే కాకుండా రాజ‌కీయ ప‌రంగాను జ‌గ‌న్‌కు ఇబ్బందిగానే ప‌రిణమించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags: CBI Case, CBI Court, Illegal Assets Allegations, YS Jagan, ysrcp