‘ కమ్మ ‘ కొట్లాట….రెడ్డి రాజకీయామా..?

ఏపీ రాజకీయాలు కుల ప్రాతిపదికనే జరుగుతాయన్న సంగతి చిన్నపిల్లాడికి సైతం తెలుసు. ఒకో కులం ఒకో పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన సంగతి కూడా తెలుసు. అయితే ఏపీ రాజకీయాలు ఎక్కువ కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్యే జరుగుతాయి. టీడీపీ కమ్మ కులానికి ప్రాతినిధ్యం వహిస్తుంటే…వైసీపీ రెడ్డి సామాజికవర్గానికి కొమ్ము కాస్తుంది. అలా అని టీడీపీలో రెడ్లు లేకుండా లేరు.. వైసీపీలో కమ్మ వాళ్ళు లేకుండా లేరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుని వైసీపీని వీక్ చేయాలని చూస్తే… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ కమ్మ నేతలని టార్గెట్ చేసుకుంది.

మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ రెడ్డి నేతలని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే..ఇప్పుడు జగన్ కమ్మ సామాజికవర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్….టీడీపీని వీక్ చేసే పనులోనే ఉన్నారు. అందులో భాగంగానే ఆ పార్టీకి గట్టి మద్ధతుగా ఉన్న కమ్మ నేతలని తమ పార్టీలోకి లాగేస్తూ..వారి చేతనే టీడీపీని తిట్టిస్తున్నారు. పైగా ఆ సామాజికవర్గ నేతలనే తిట్టిస్తున్నారు.

ఇదే విషయంపై కమ్మ పెద్దలు కూడా తెగ ఫీల్ అయిపోతున్నారట. మనలో మనకు కొట్లాట పెట్టి రెడ్లు రాజకీయం చేస్తున్నారని బాధపడుతున్నారట. ఈ విషయం ఇటీవల జరుగుతున్న కార్తీక మాసం సందర్భంగా జరిగే వనభోజనాల్లో బయటపడింది. సాధారణంగా వనభోజనాలు కులాల ప్రాతిపదికన జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కృష్ణా జిల్లాలో కమ్మ సామాజికవర్గం పేరిట జరిగిన ‘కమ్మ ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆ కుల పెద్దలు బోరుమన్నారట.

కమ్మ నేతలు పార్టీల వారీగా విడిపోయి..కులం పరువుని బజారునా పడేశారని పెద్దలు బాధపడుతున్నారట. అసలు దీనికంతటికి కారణం చంద్రబాబేననీ వారు అంటున్నారు. ఆయన కొడుకు కోసం చూసుకుని మిగతా వారిని పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని అనుకున్నారట. చంద్రబాబుతో పాటు ఓ మీడియా సంస్థ కూడా అత్యుత్సాహం చూపిస్తూ కమ్మ కులం పరువు తీస్తున్నారని వాపోయారట.

అలాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వారు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతూ కమ్మ సామాజికవర్గ పరువుని మరింత పోగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కమ్మ సామాజికవర్గ నేతలు ఒకరిపై ఒకరు గొడవలు పడటానికి కారణం రెడ్డి నేతల రాజకీయమే అని అంటున్నారు. వారు సైలెంట్ గా రాజకీయం చేస్తూ కమ్మ నేతల మధ్య కొట్లాట పెడుతున్నారని కుల పెద్దలు భావిస్తున్నారట. మొత్తానికి రెడ్డి రాజకీయంలో కమ్మ నేతలు బలైపోతున్నారు.

Tags: AP, ChandrababuNaidu, Kamma Caste, kodali nani, Vallabaneni Vamsi, YS Jagan