ఎమ్మెల్యే కార్వర్టర్స్‌ భవనం ఎక్కి రాజధాని రైతుల నిరసన

అమరావతి రాజధాని ప్రాంతం రైతులు రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరు మూడురాజధానుల ఏర్పాటును సమర్థిస్తూ, మరొకరు వ్యతిరేకిస్తూ పోటాపోటీగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి పరిధిలోని సుమారు 29 గ్రామాల ప్రజలు ఆందోలన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. మందడం వద్ద గత 32 రెండు రోజులుగా నిరవధిక దీక్షలను చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ తుళ్లూరు. నెక్కళ్లు గ్రామాలకు చెందిన తమ ఆందోలనలను ఉధృతం చేశారు. అమరావతిలో నూతన నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ భవనం వద్ద ధర్నాకు దిగారు. అందులో ఇద్దరు రైతులు భవనంపైకి ఎక్కి నిరసనకు దిగారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని తరలింపు అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. రైతులు భవనం ఎక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tags: ap capital amaravathi, FORMERS AGITATION