ఆఫ్ ది రికార్డ్‌: సంక్షేమం స‌రే.. సంప‌ద మాటేంటి… వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

అధికార పార్టీ నాయ‌కుల్లో అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతోంది. వైసీపీ నేత‌ల్లో చాలా మంది విద్యా వంతులే ఉన్నా రు. మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఓ ప‌ది మంది మిన‌హా.. మిగిలిన వారంతా ఉన్న‌త విద్య‌ను లేదా క‌నీసం డిగ్రీ చ‌దువు కున్న‌వారు ఉన్నారు. దీంతో వీరంతా కూడా త‌మ త‌మ ఫ్రెండ్స్ లేదా పార్టీలోని కీల‌క నేత‌ల‌తో సోష‌ల్ మీడియా చాటింగ్ చేస్తుంటారు. పైగా అప్పుడ‌ప్పుడు హైద‌రాబాద్‌లోని ఫ్రెండ్స్ ఇళ్ల‌లో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌కూడా హాజ‌రువుతున్నారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌కు ఘ‌న స్వాగ‌త‌, స‌త్కారాలు కూడా జ‌రుగుతున్నాయి. అయితే, ఇవ‌న్నీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఇష్ట‌ముండ‌ద‌ని తెలిసిన నాయ‌కులు.. ప్రైవేటుగా లాగించేస్తున్నారు.
అంటే.. త‌మ సొంత ఫొటో గ్రాఫ‌ర్ల‌ను పెట్టుకుని కార్య‌క్ర‌మాల‌కు అటెండ్ అవుతున్నారు. బ‌య‌ట మీడి యాకు కానీ, వెబ్‌సైట్ల‌కు కానీ ఎలాంటి వార్త‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అయితే, ఎంత దాచినా మీడియా ఊరుకోదు క‌దా? ఇప్పుడు అలాగే.. వైసీపీ నేత‌ల సంగ‌తుల‌ను కూపీ లాగుతున్నారు.

తాజాగా తెలిసిన విష యం ఏంటంటే.. వైసీపీ నాయ‌కులు ఏ పార్టీకి వెళ్లినా. ఏ కార్య‌క్ర‌మానికి హాజ‌రైనాకూడా వారి తో ముచ్చ‌టిస్తు న్న‌వారు.. “మీ జ‌గ‌న్ పాల‌న బాగుంది. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంక్షేమా న్ని బాగానే అమ‌లు చే స్తున్నారు. నిజానికి ఈ రేంజ్‌లో పాల‌న ఉంటుంద‌ని భావించ‌లేదు. అయితే, సంక్షే మం బాగున్నా.. సంప‌ద ఎలా తెస్తారు?  దీనికేమైనా మార్గాలున్నాయా?“ అని ప్ర‌శ్నిస్తున్న‌వారి సంఖ్య పెరుగుతోంద‌ని వైసీపీ నాయ‌కులు ఆఫ్ దిరికార్డుగా చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రికొంద‌రైతే.. “చంద్ర‌బాబు తీసుకొచ్చిన కంపెనీల‌న్నీ.. వెన‌క్కి వెళ్లిపోతున్నాయి. పోల‌వ‌రం ప‌నులు ఏం జ‌రుగుతున్నాయో కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌డం లేదు. ఎంత సంక్షేమంపై దృష్టి పెట్టినా.. రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోతే.. ఎలా?  మ‌రో రెండు మాసాల్లో స్థానిక ఎన్నిక‌లు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు అభివృద్ధి ని టార్గెట్ చేస్తే.. మీరు ఏం స‌మాధానం చెబుతారు?“ అని ప్ర‌శ్నిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి ఈ ప్ర‌శ్న‌లు అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నా.. సీనియ‌ర్లు అయితే.. బాహాటంగానే త‌మ మిత్రుల వ‌ద్ద చెప్పుకొంటున్నారు. మా నాయ‌కుడు సంక్షేమం పై దృష్టి పెట్టారు.

సంప‌ద విష‌యంలో కూడా కొంత ప‌ట్టించుకుంటే బెట‌ర్ క‌దా?  అభివృద్ధి పై కూడా దృష్టి పెడితే.. తిరుగే ఉండ‌దు క‌దా? అనుకుంటున్నారు. అయితే, ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. ఎవ‌రు ఎన్నెన్ని కీలక విష‌యాలు చ‌ర్చించుకుంటున్నా.. అధినేత సంబంధీకుల‌తో కానీ, అధినేత జ‌గ‌న్‌కు చ‌నువుగా ఉండేవారితో మాత్రం పంచుకునేందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యం తెలిస్తే.. జ‌గ‌న్ పాజిటివ్‌గా స్పందిస్తారా?  నెగిటివ్‌గా స్పందిస్తారో తెలియ‌క త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. సో.. మొత్తానికి వైసీపీ నేత‌ల అంత‌ర్మ‌థ‌నం ఇద‌న్న‌మాట‌..!

Tags: AP, welfare schemes, YS Jagan, ysrcp