అత్తారింటికి + స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి = అల వైకుంఠ‌పురంలో…. టీజ‌ర్ అదే చెప్పిందా

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయన సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాలు అంటే తెలుగు ఫ్యామిలీలు ప‌నిక‌ట్టుకుని మ‌రీ థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు ఎంజాయ్ చేసేవారు. త్రివిక్ర‌మ్ మార్క్ డైలాగులు, పంచ్‌లు, కామెడీ, స్మూత్ యాక్ష‌న్‌, సిస్ట‌ర్‌, ఫాద‌ర్ సెంటిమెంట్లు, సునిశిత‌మైన ప్రేమ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి.

త్రివిక్ర‌మ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని సినిమాలు అలానే ఉంటాయి. అయితే కొద్ది రోజులుగా త్రివిక్ర‌మ్ క‌లం ప‌దును త‌గ్గ‌డం… రొటీన్ సీన్ల‌తో సినిమాలు చుట్టేయ‌డం… ఇత‌ర భాష‌ల్లో సినిమాల సీన్ల‌తో పాటు హాలీవుడ్ సినిమాల లైన్ ఎత్తేయ‌డం.. త‌న సినిమాల సీన్ల‌ను తానే కాపీ కొట్ట‌డం చేస్తూ ఉన్నాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన అల వైకుంఠ‌పురంలో టీజ‌ర్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ స‌త్తాపై అనేక సందేహాలు రేకెత్తిస్తోంది.

ఈ టీజ‌ర్ చూస్తూనే ఈ సినిమా ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, ఇప్పుడు అల వైకుంఠపురంలో ఇలా అన్ని సినిమాలు ఒకే స్టైల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ల‌తోనే న‌డుస్తున్నాయి. అత్తారింటికి దారేదిలో అత్త కోసం అల్లుడి ప‌డే త‌ప‌న‌తో క‌థ ఉంటుంది.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా తండ్రి సెంటిమెంట్ చుట్టూనే క‌థ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అత్తారింటికి దారేదిలో సునంద నిల‌యంకు వెళ్లిన‌ట్టే వైకుంఠపురం అనే ఇంటికి వెళ్లి అక్కడ బన్ని ఏం చేశాడు అన్నది కథ. ఇక త్రివిక్ర‌మ్ మార్క్ సెంటిమెంట్‌, డైలాగులు ష‌రా మామూలే అంటున్నారు. సినిమా క‌థ మ‌రి కొత్త‌గా ఉండ‌ద‌ని టీజ‌ర్ చెప్పేసింది. ఇక సినిమా ఎలా ఉంటుందో ? వ‌చ్చే నెల 12న తేలిపోనుంది.

Tags: Ala Vaikuntapuramlo, Attarintiki Daredi, Copy, S/O Satyamurthy, Tollywood, trivikram