హాలివుడ్ రేంజ్‌లో విశ్వ‌క్‌సేన్ టీజ‌ర్‌..

ఒక‌వైపు హీరోగా నాని వ‌రుస సినిమాల‌ను చేస్తూ బిజీగా ఉంటూనే మ‌రోవైపు నిర్మాత‌గా ప‌నుల‌ను చ‌క‌చ‌కా న‌డిపిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇప్ప‌టికే విల‌న్‌, తాజాగా ట‌క్ జ‌గ‌దిష్ సినిమాల‌కు సంబంధించిన షూటింగ్‌ల‌ను ప్రారంభించాడు. మ‌రోవైపు దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత తాను నిర్మిస్తున్న విశ్వ‌క్‌సేన్‌ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ఫలక్‌నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ కాప్‌గా క‌నిపించ‌నున్నారు. అత‌నికి జంట‌గా చిల‌సౌ చిత్రం ఫేమ్ రుహానీశ‌ర్మ హిరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, కొత్త దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. నాని ఫ్రెండ్ ప్ర‌శాంతి తిపిరినేని స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా కట్ చేశారు చిత్ర యూనిట్‌. టీజర్‌లోనే కథ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫ్లై ఓవర్‌పై బైక్ ఛేజ్.. ఆ తర్వాత ఓల్డ్ సిటీలో దొంగల వెనక మఫ్టీలో ఉన్న పోలీసులు పరిగెత్తడం.. సీన్ కట్ చేస్తే విశ్వక్ ఒక హాస్పిటల్ బెడ్‌పై పడుకుని ఉండడ‌డం అంతా చకా చకా జరిగిపోతాయి. “దిస్ జాబ్ విల్ డిస్ట్రాయ్ యూ విక్రమ్.. యూ నీడ్ టు క్విట్ ది డిపార్ట్మెంట్” అంటూ ఒక మహిళ డైలాగ్‌, అయినా ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి “సర్ నాకు ఈ మిస్సింగ్ పర్సన్స్ కేసు అసైన్ చెయ్యండి సార్” అంటూ తన పై అధికారిని విశ్వ‌క్ కోరడం ఆస‌క్తిని రేకేత్తిస్తున్నాయి. విశ్వక్‌ను ఎందుకు డిపార్ట్‌మెంటుకు దూరం చేప్తారు.. అసలు ఆ కేస్ ఏంటి? అనే స‌స్పెన్స్‌ను ఆడియ‌న్స్‌లో క్రియేట్ చేస్తున్న‌ది టీజర్. మొత్తంగా ఒక హాలీవుడ్ రేంజ్‌లో టీజర్‌లో ఉంద‌ని టాక్‌. విశ్వక్ సేన్ మరోసారి ఈ చిత్రంతో ఆకట్టుకునేలాగే కనిపిస్తున్నాడు. నాని కూడా చాలా సెలెక్టివ్‌గా కథలు ఎంచుకుంటాడు కాబట్టి హిట్ ప‌డేలానే ఉంది. ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

http://https://youtu.be/GNn_ovCI85Q

Tags: reethu varma, ruhaani sharma, shailesh kolanu, Vishwak Sen