రాజకీయరంగం లో బిజిగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి లాగాలని ఎందరో ప్రయత్నిస్తున్నా అది సాధ్యం అవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయించాలని అనేక మంది దర్శకులు, నిర్మాతలు కథలు పట్టుకుని వెంట పడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో మరో దర్శకుడు సురేందర్‌రెడ్డి చేరారు.
సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సైరా చిత్రం ను రూపొందించిన సురేందర్‌రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు కథ వినిపించేందుకు సురేందర్ రెడ్డి కలిసారు.
పవన్ కళ్యాణ్‌తో కలిసిన తరువాత సురేందర్‌రెడ్డి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసిన మరో కథ వినిపించారని టాక్. ఇద్దరు హీరోలను కలిసిన సురేందర్‌రెడ్డి ఇప్పుడు ఎవరితోనే ఒకరితో సినిమా చేసుడు ఖాయమని టాక్. పవన్ కళ్యాణ్ సినిమా ఓకే చేస్తే దిల్ రాజు నిర్మాణంలోనైనా లేకపోతే మైత్రీ మూవీ మేకర్స్ తో నైనా సినిమా చేసే అవకాశం ఉందని వినికిడి. ఏదేమైనా సురేందర్‌రెడ్డి పవన్ కళ్యాణ్‌తో భేటి కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్‌టాఫిక్‌గా మారింది.