ప్రిన్స్ మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం సరిలేరూ నీకెవ్వరూ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సంక్రాంతి కోసం ఎదురు చూస్తున్న మహేష్‌బాబు అభిమానులకు ముందుగా టీజర్ రూపంలో ఓ శుభవార్త వినబోతున్నారు. ఈ చిత్రం టీజర్ ఓ ప్రత్యేకమైన రోజున విడుదల చేయబోతున్నారు. అందుకు మూహూర్తం ఖరారు చేసినట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకు సరిలేరూ నీకెవ్వరూ చిత్ర టీజర్‌ను ఏ రోజున విడుదల చేస్తారో అనే ఉత్కంఠలో ఉన్న అభిమానులకు చిత్ర యూనిట్ ఓ మంచి రోజున అంటే, ఆ రోజున విడుదల చేసేందుకు సమాయాత్తం అవుతున్నారని టాక్. ఆ మంచి రోజు ఏ రోజు అనుకుంటున్నారు కదూ.. అదేనండీ… చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడి పుట్టిన రోజు. అయితే అనిల్ రావిపూడి పుట్టిన రోజు ఎప్పుడు అనుకుంటున్నారా… అదే ఈనెల 23న.
చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టిన రోజునాడు చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే దర్శకుడు టీజర్, ట్రైలర్‌ను రెడి చేసి విడుదలకు సిద్దంగా ఉంచారు. ఇంతకు ముందు లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి పుట్టిన రోజున ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అందుకు ముందు మహేష్‌బాబు పుట్టిన రోజుకు ఒక ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టిన రోజున టీజర్ విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇక మహేష్‌బాబు అభిమానులకు పండుగే పండుగ.