సంక్రాంతికి సీఎం జగన్‌ బంపర్‌ ఆఫర్‌

సంక్రాంతి పండగంటనే పల్లెల్లో కనిపించే సందడే వేరు. తెలుగు సినీ పరిశ్రమకు కాసుల వర్షం కురిసే రోజులు. అందుకే అగ్రహీరోలు తమ సినిమాలను సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకుంటుంటారు. ఆ బాటలో ఈసారి ఇద్దరు యంగ్‌స్టార్లు బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరుతో ప్రిన్స్‌ మహేశ్‌బాబు, అల వైకుంఠపురముతో అల్లు అర్జున్‌ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారి వారి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

 

అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఆ రెండు సినిమాలను సంక్రాంతి పండగపూట రోజు 6 షోలను నడిపించుకోవచ్చని అనుమతిచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. తొలుత సరిలేరు నీకెవ్వరు మూవిని ఆరు షోలు నడిపించుకునేందుకు అనుమతించిన సీఎం జగన్‌ తాజాగా అలవైకుంఠపురం చిత్రానికీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో పండగపూట సినిమా థియేటర్లలో సందడి నెలకొననున్నది. మరి ఈ బరిలో ఎవరు దూసుకుపోతారో? ఎవరు డిలీ పడిపోతారో చూడాలి.

Tags: ala vikuntapuramlo, cm jagan, movies sari leru neekevvaru