శృంగారం చేసే ముందు ఏమైనా తింటున్నారా? ఇక మీ పని అంతే..

శృంగారం చేసే ముందు ఎలాంటి జంక్‌ ఫుడ్‌ను తీసుకోవద్దని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అది నిద్రలేమికి కారణమవడమేగాక, ఆపై శృంగార శక్తిని కూడా కృంగదీస్తుందని వారు వివరిస్తున్నారు. చాలా మంది పడక గదిలోకి వెళ్లే ముందు ఏదో ఒకటి తింటుంటారు. ఎందుకంటే శృంగారాని కావాల్సిన శక్తిని సంపాదించుకోవాలనే ఉబలాటంతో. అయితే తీసుకునే ఆ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు. నిపుణులు. లేకుంటే అసలు మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.

మరీ ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. శృంగారానికి ముందు అధిక మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వల్ల రాత్రంతా కునుకు పాట్లు తప్పవని వివరిస్తున్నారు. ఎందుకంటే పిజ్జా, బర్గర్‌ లాంటి జంక్‌ ఫుడ్‌లో వాడే పిండి రిఫైన్డ్‌ క్వాలిటీ కావడం వల్ల అందులోని ఫైబర్‌ శాతం పూర్తిగా తగ్గిపోతుందని, తత్ఫలితంగా అది జీర్ణశక్తిపై ప్రభావం చూపుతుందని తెలుపుతున్నారు. అలాగే అందులోని సాస్‌, చీజ్‌, మాంసం వల్ల హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాలకు భవిష్యత్‌లో అనార్థలు ఏర్పడుతాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు పిజ్జా తింటే దానిని అరిగించేందుకు రక్తప్రసరణ వ్యవస్థ మొత్తం జీర్ణకియ్రలో భాగం కావాల్సి ఉంటుందని, దీంతో శృంగారాని కావాల్సిన ఉత్తేజం కొరవడుతుందని, దీంతో హర్మోన్లు విడుదల కాక నిద్రకూడా సరిగా పట్టని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. శృంగారానికి ముందుకు ఏదయిన లైట్‌ ఫుడ్‌ మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

Tags: JUNK FOOD, SEXUAL LIFE, SLEEPING NESS DISORDER