వైసీపీ నేతలపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఆ పార్టీ శ్రేణుల వ్యవహారంపై మండిపడ్డారు. నేను సైగ చేస్తే ఏమయ్యేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఈ లెజెండ్. విషయమేమిటంటే.. గురువారం రోజున ఆయన తన నియోజకవర్గమైన హిందూపురం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. మూడు రాజధానుల ఏర్పాటును, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేయడాన్ని బాలయ్య వ్యతిరేకించడంపై వారు మండిపడ్డారు. బాలయ్య గో బ్యాక్.. రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలు బాలయ్యను అడ్డుకోగా, ఆయనకు మద్దతుగా టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతిపజేసి అక్కడి నుంచి పంపించివేశారు. అయినప్పటికీ వైసీపీ నేతలు బాలయ్య కాన్వయ్ వెళ్లేంత వరకూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.
ఇక ఈ ఘటనపై నందమూరి వారసుడు తాజాగా స్పందించారు. వైసీపీ నేతలపై మండిపడ్డారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న నేను ఒక్క సైగ చేస్తే…ఏమయ్యేదంటూ ఫైర్ అయ్యారు. తన వెనుక ఆ సమయంలో వందలాది మంది ఉన్నారన్నారు. నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. పనిలో పనిగా బాలకృష్ణ. తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. కుమారుడు రద్దు చేస్తున్నాడంటూ సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. అయితే ఇంతవరకు మూడు రాజధానులకు వ్యతిరేకంగా బాలకృష్ణ ఎక్కడా నోరు విప్పకపోయినా చంద్రబాబు ఆందోళనలకు మాత్రం మద్దతు తెలుపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తొలిసారిగా ఆ అంశంపై బాలయ్య స్పందించారు. మరి బాలయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో ?
http://https://youtu.be/V10PaZYlwtA