రకుల్ ప్రీత్ సింగ్ బ్రాంచ్‌లు తెరవబోతుంది.. అవునా.. టాలీవుడ్లో నటీమణులు బ్రాంచ్‌లు తెరవడం ఏమిటీ అనుకుంటున్నారా..? అవును నిజమే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు హైదరాబాద్‌ను హెడ్ ఆఫీసుగా చేసుకుని మరికొన్ని పట్టణాల్లో బ్రాంచ్‌లు తెరుస్తుంది. ఎందులో అనుకుంటున్నారా..? అమె ఇటీవల కాలంలో ఎక్కువగా జిమ్‌లో కాలం గడుపుతుంది. ఫిట్నెస్ కోసం అమె జిమ్‌లో కాలం గడుపుతుందనుకుంటున్నారా.. అదేం కాదు.. ఇప్పుడు రకుల్ జిమ్‌ల బిజినెస్ చేస్తోంది.. అవునా.. జిమ్‌ల బిజినెస్ ఏంటీ అనుకుంటున్నారా..
టాలీవుడ్ లో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో మన హీరోలు, హీరోయిన్లు, టెక్నిషియన్లు ముందు వరుసలో ఉంటున్నారు. ఫామ్ లో ఉండగానే, సినిమాలు చక చక చేసేసి, ఆస్తులు కూడబెట్టుకుని సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. హీరోలు అల్లు అర్జున్, ప్రిన్స్ మహేష్‌బాబు, నానితో పాటుగా పలువురు హీరోలు సొంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకుని, కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. కేరీర్ బాగా ఉన్నప్పుడే ఆస్తులు పోగేసుకోవాలని, డబ్బు కూడ బెట్టుకోవాలని ఆరాట పడుతున్నారు.అందుకే ఈ వ్యాపారంలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడు వీరి బాటలో టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వ్యాపార రంగంలోకి దిగుతుంది.
టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ అందరికంటే ముందే ఉంది. వచ్చిన కొత్తలోనే హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కుంది. ఇప్పుడు బెంగళూరులో ఓ ఫ్లాటు కూడా తన సొంతం చేసుకుందని సమాచారం. బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో రూ.6 కోట్లతో ఓ ఫ్లాటు తీసుకుందట రకుల్. అక్కడ రకుల్‌కి కొంతమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ల సలహాలు, సూచనలు తీసుకొనే బెంగళూరులో ఫ్లాట్ కొన్నదని తెలుస్తోంది. హైదరాబాద్‌లో రకుల్ సొంతంగా ఓ జిమ్ నిర్వహిస్తోంది. బెంగళూరులో కూడా అలానే బ్రాంచీలు తెరవాలని చూస్తోందట. ఈమధ్య రకుల్‌ప్రీత్ సింగ్ హవా కాస్త తగ్గినట్టు అనిపించింది. అయితే బాలీవుడ్లో ఓ మంచి విజయం అందుకోవడంతో తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టైంది. అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు జిమ్ వ్యాపారంలోకి బాగా పోగేసుకోవాలని ఆరాట పడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు రాళ్ళు వెనకేసుకునే పనిలో బిజిగా ఉంది.