ఇవీవీ తనయుడిగా తెలుగు చిత్రసినిమాకు పరిచయమైనా తనదైన శైలీలో కామెడినీ పండించి సొంత గుర్తింపును తెచ్చుకున్నారు అల్లరి నల్లరి. ఆయన నటించిన తొలి చిత్రమే ఇంటి పేరుగా నిలిచిపోయింది. కామెడీ చిత్రాలే గాక, గమ్యం. నేను తదితర విభిన్న కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలలోనూ ప్రత్యేక పాత్రలను పోషించి నటన కౌశలాన్ని నిరూపించుకున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గతేడాది విడుదలైన మహర్షి సినిమాలోనూ ప్రిన్స్ మహేష్‌బాబుకు మిత్రుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా తాను నటించబోయే కొత్త సినిమా విశేషాలను ఆయన వెల్లడించారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ల్ లుక్ పోస్టర్‌ను సినిమా బృందంతో కలిసి శనివారం విడుదల చేశారు. ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటున్నది. చిత్రంపై ఆసక్తిని పెంచేలా ఉంది.
ఇదిలా ఉండగా ఆ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోషల్‌మీడియాలో షేర్‌తో చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈనెల 20 తేదీన రామానాయుడి స్టూడియోలో సినిమా షూటింగ్ పూజా కార్యక్రమం ప్రారంభం కానుందని ప్రకటించారు. అదే విధంగా ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నరేష్ కోరారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మరికొందరు నరేష్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్రను పోషించనున్నారు. అదేవిధంగా శతమానంభవతి, ఎంతమంచివాడవురా తదితర చిత్రాల దర్శకుడు సతీష్వేగేష్న ఈ చిత్రాన్ని నిర్మిచనుండడం మరో విశేషం.