హీరో ఉదయ్ శంకర్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం మిస్ మ్యాచ్. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఈ మిస్ మ్యాచ్ సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ఫైటర్ గా నటించింది. శ్రీరామ్ రాజు – భరత్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను వదిలారు. కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన ఈ ట్రైలర్ ఓ కుస్తీ నేపథ్యంతో తెరకెక్కించారని అర్థమవుతుంది.
హీరో హీరోయిన్ల కుటుంబాలకు చెందిన సభ్యులకి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్న ఈ ట్రైలర్ ను కట్ చేశారు దర్శకుడు నిర్మల్ కుమార్. కుస్తీ పోటీలలో పాల్గొనే కథానాయిక హీరో ప్రేమలో పడటం, అతనితో పెళ్లికి ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొనడమే అభ్యంతరం కావడం ఈ ట్రైలర్లో చూపించారు. ప్రేమ, ఎమోషనల్స్ కి సంబంధించిన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
మిస్ మ్యాచ్ సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. ఐశ్వర్యా రాజేష్ ఇంతకు ముందు కౌసల్యా కృష్ణమూర్తి సినిమాలో క్రికెటర్గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో కుస్తి పోటీలు చేసే క్రీడాకారిణిగా నటిస్తుంది. కౌసల్య కృష్ణమూర్తి తరువాత ఐశ్వర్య రాజేశ్ చేసిన ఈ సినిమా, ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.