ఇలియానా ఈ పేరు వినగానే కుర్రకారు ఉర్రుతలూగిపోతారు. బొద్దుగా వుండే హీరోయిన్స్ నే ఇష్ఠ్టపడే టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రియులను జీరో సైజు అందాలతో తనవైపుకు తిప్పుకున్న అమ్మడు ఇలియాననే. ఇలియానా ఎంట్రీతో తెలుగు, తమిళ సినీమా హీరోయిన్స్ అంతా జీరో సైజు అందాలకోసం కష్టపడటం ప్రారంభించారు అదే ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతింది. అయితే ఎంతమంది వచ్చినా కానీ ఇలియానా రేంజ్ క్రేజ్ మాత్రం ఎవ్వరూ తెచ్చుకోలేకపోయారు.
దేవదాస్ సినిమాతో రామ్ తో ఆడి, పాడిన అమ్మడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుతెచ్చుకొని మహేష్ బాబుతో పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పోకిరిసినిమాలో ఇలియానా ని చూసిన కుర్రకారు అమ్మడికి ఫిదా అయిపోయారు. అయితే కరీర్ ప్రారంభం లోనే తెలుగు, తమిళ స్టార్ హీరోస్ అందరితోనూ నటించే అవకాశాల్ని కొట్టేసిన అమ్మడు సడన్ గా బాలీవుడ్ లో అవకాశం రావటం తో అక్కడకు చెక్కేసింది. కానీ ఈ రేంజ్ లో అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ తో డేటింగ్ చేసి ఇప్పుడు బ్రేకప్ కూడా చేసుకుంది. దీంతో అమ్మడి దృష్టి మళ్ళి సౌత్ సినిమాలపైన పడింది.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రీ ఎంట్రీకోసం ఫోటోషూట్లలో పిచ్చెక్కించే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. దీంతో ఇప్పటికీ తనలో సెక్సీ అప్పీల్ పోలేదని నిరూపించుకునే పనిలో ఉన్నట్టుంది. కానీ అప్పటి ఇలియానాతో పోలిస్తే ఇప్పటి ఇలియానా కొంచెం బొద్దుగా తయారయినట్టుంది. చూదాం అమ్మడి రీఎంట్రీ ప్రయత్నాలు ఫలిస్తాయోలేదో!!!