వెటరన్ హీరో కు ఇప్పుడు దర్శకులు దొరకడం లేదా..? అసలు ఈ వయస్సులో హీరోగా ఇంకా కొనసాగుతున్న ఈ హీరోకు ఇప్పుడు ఓ ఫెయిల్యూర్ దర్శకుడు తోడయ్యాడు. అసలే రీమేక్ చిత్రం. తీసిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఈ వెటరన్ హీరోతో సినిమా చేసేందుకు రెడి అయ్యాడు ఆ దర్శకుడు. ఈ వెటరన్ హీరో కూడా తనకు దొరికిన అణిముత్యం ఈ దర్శకుడు అని సంతోష పడుతున్నాడు.
ఇంతకు ఈ వెటరన్ హీరో ఎవ్వరు…? వరుస ప్లాపులతో ఉన్న ఈ దర్శకుడు ఎవ్వరు..? ఇంతకు ఏ రీమేక్ చిత్రం అనుకుంటున్నారా.? తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించిన చిత్రం అసురన్. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ఈసినిమాను రీమేక్ చేసేందుకు నిర్మాత సురేష్‌బాబు హక్కులు కొనుగోలు చేశారు. అయితే ఈ సినిమా రీమేక్‌లో విక్టరీ వెంకటేశ్ నటించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సరైన దర్శకుడు దొరకకపోవడంతో నానా తంటాలు పడుతున్న వెంకటేశ్‌కు ఓ ప్లాప్ దర్శకుడు దొరికాడు.
విక్టరీ వెంకటేశ్ అసురన్ రీమేక్ చిత్రం నటించబోతుండగా ఈ సినిమాను దర్శకత్వం చేసేది హను రాఘవపూడి. ఈ దర్శకుడు నితిన్‌తో లై, శర్వానంద్‌తో పడి పడి లేచె మనస్సు సినిమాలు తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలు రెండు భారీ ప్లాప్‌లు అయ్యాయి. దీంతో అవకాశాలు లేక దర్శకుడు సతమతమవుతున్నాడు. అయితే ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ బంఫరాఫర్ ఇచ్చాడనే అనుకోవచ్చు. అసలే వెంకటేశ్ సరసన శ్రియ శరన్ హీరోయిన్గా ఎంపిక కాగా, ఇప్పడు ఓ ఫెయిల్యూర్ దర్శకుడు ఈ ప్రాజెక్టు చేపట్టబోతుండటంతో పట్ల ఇప్పడు ఆసక్తి నెలకొంది.