మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ప్రతిరోజు పండుగే ట్రైలర్ ఘనంగా లాంచ్ అయింది. చిత్రంలో సాయిధరమ్ తేజ్‌కు జంటగా రాశీఖన్నా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రతిరోజు పండుగే. ఈసినిమా డిసెంబర్ 20 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయిధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాను బన్నీవాసు నిర్మించగా, తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా కథను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా విని ఓకే చేశారు.
ప్రతిరోజు పండుగే ట్రైలర్‌ను 2.18నిమిషాలు కట్ చేశారు దర్శకుడు. ఈసినిమా ట్రైలర్లో అమెరికాకు చేరిన కొడుకులు తండ్రిని పట్టించుకోకపోవడంతో మనవడిగా వచ్చిన సాయిధరమ్ తేజ్ పల్లేటూరి వాతావరణంలో తాతతో ఎలా గడిపాడో చూపారు. చిత్రంలో పల్లేటూరి వాతావరణం, తాత మనవడి అనుబంధంను చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు మారుతి. చిత్రంలో ప్రతిప్రేములో ఓ ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తుంది. మొత్తానికి ఈ చిత్రం పల్లెకు అమెరికాకు మరోమారు లింక్ పెడుతు సినిమాను రూపొందించారు.
ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను ఎంతో బాగా కట్ చేశారు దర్శకుడు మారుతి. ఈ సినిమా సాయిధరమ్ తేజ్‌కు కేరీర్ బెస్ట్ సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్ దర్శకుడు, చిత్ర యూనిట్ భారీగానే చేపట్టారు. ఈ సినిమా మెగా కుటుంబంలో ఓ బెస్ట్ సినిమాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరి వాడేలే అనే సినిమాకు సరిపోయేలా ఉన్నట్లు కనిపిస్తుంది. సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా రోమాన్స్ అదుర్స్‌గా ఉంది.