పాయల్ రాజ్‌పుత్ మీకు తెలిసే ఉంటుంది కదా.. హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించే ఈ భామ. ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ భామ ఇప్పుడు వెంకిమామతోనూ, డిస్కోరాజాతోనూ ఆడిపాడుతుంది. అయితే ఈరోజు ఈ హాట్ భామ పుట్టిన రోజు. అందుకే ఈ రెండు చిత్రాల యూనిట్లు పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్‌లుక్‌ను సోలోగా విడుదల చేశారు. పాయల్ పాప పుట్టిన రోజుకు రెండు సినిమాల చిత్ర యూనిట్లు ఇలా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం పట్ల పాయల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100 సినిమాలో కార్తికేయతో ఆడిపాడింది. ఈ సినిమాతో నటిగా బాగానే పాపులర్ అయిన ఈ భామ తరువాత తమ బోల్డ్, హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఇంకా మరింత పబ్లిసిటి సంపాదించింది. పాయల్ అంటేనే హాట్ భామ అని ముద్ర పడిపోయింది. అయితే డిస్కోరాజా సినిమాలో మాస్‌మహారాజ రవితేజతో జోడి కట్టింది. ఈసినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోలో కొత్తదనంగా ఉంది. హాట్ హాట్‌గా కనిపించే పాయల్ ఈ ఫస్ట్‌లుక్‌లో మాత్రం విభిన్నంగా ఉంది. ఓ చేతిలో పిస్టోల్ తో ప్రత్యర్థులకు గురిపెట్టిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో రెండు జడలు వేసుకొని చేతిలో గన్ పట్టుకొని సీరియస్ లుక్‌లో కనిపిస్తుంది. ఈ పోస్టర్ పాయల్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నారు. డిసెంబర్ 6న చిత్ర టీజర్ విడుదల కానుంది. ఇక వెంకిమామ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ సరసన నటిస్తుంది రాజ్‌పుత్. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లోనూ పాయల్ రాజ్‌పుత్ తన స్వభావానికి విరుద్ధంగా ఉంది. చేతిలో పుస్తకాలతో ఓ ఉపాధ్యాయురాలిగా కనిపిస్తోంది. కానీ అమె కళ్ళల్లో మాత్రం కవ్విస్తున్న దాఖాలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.