నైజాం కింగ్‌ అలవైకుంఠపురంలో..

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా రికార్డులను బ్రేక్‌ చేస్తున్నది. పాజటివ్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతూ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నది. తాజాగా ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్‌ సరికొత్త రికార్డును నమోదు చేశారు. సంక్రాతిని టార్గెట్‌ చేసుకుని జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతి సెంటర్‌లోనూ విజయవిహారం చేస్తున్నది.

ఇక ఈ సినిమా తొలి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల షేర్‌ చేసిందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదిగాక అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అతితక్కువ కాలంలో రూ. 30కోట్లను రాబట్టిన సినిమాగా అలవైకుంఠపురంలో నిలిచిపోవడం విశేషం. తెలంగాణ ప్రబుత్వంలో ఇక నైజాంలో 8 రోజుల్లో ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే 31.86 కోట్లను సాధించడం మరో విశేషం. ఇక యూఎస్‌లో 2.5 బిలియన్లను వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. త్వరంలో 3 మిలియన్ల మార్క్‌ను చేరుతుందని సినీ ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags: Ala Vykuntapuramlo, allu arjuna, latest collections, thrvikran