నారా లోకేష్‌కు బ‌లిసిన కోడి గ‌తే : ఎమ్మెల్యే రోజా

వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌పై విరుచుకుప‌డ్డారు. ఏపీ శాసన మండలి రద్దును కేబీనెట్ ఆమోదించింది. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ నేతలు దానిని స్వాగ‌తిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మ‌ల్యే రోజా మాట్లాడుతూ.. టీడీపీ పెద్దల సభను అపహాస్యం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని. ఛైర్మన్‌ను ఎలా కంట్రోల్ చేశారో రాష్ర్ట ప్ర‌జ‌లందరూ చూశార‌ని, అది సిగ్గుచేట‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం మొత్తం వెన్నుపోటుల మ‌య‌మేన‌ని, అప్పట్లో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచార‌ని, వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొని వారిలో నలుగురిని మంత్రుల్ని చేసి వ్యవస్థల్ని బ్రష్టుపట్టిం చార‌ని తెలిపారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతార‌ని ఎద్దేవా చేశారు. మండలిలో టీడీపీ రూల్స్ ప్రకారం వెళ్లలేద‌ని, ముందుగా నోటీసిచ్చి ఉంటే బాగుండేద‌ని, అదీగాక‌ మండలికి వెళ్లే బిల్లుల్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తిప్పికొడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. బినామీలు, తాను అమరావతిలో కొనుగోలు చేసిన భూముల్ని కాపాడుకోవడానికే మండలిలో చంద్రబాబు, డ్రామాలు ఆడుతున్నార‌ని న‌ప్పులు చెరిగారు. శాసన మండలిని రద్దు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు రాయలసీమను నాశనం చేస్తే, సీఎం జగన్ అభివృద్ధి వైపు నడిపిస్తున్నార‌ని, కర్నూలును రాజధానిగా చేస్తున్నారని కొనియాడారు. శాస‌న‌మండ‌లి ర‌ద్దు చేస్తూ సీఎం జ‌గ‌న్ తీసుకున్న‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 80 శాతం హామీలను జగన్ నెరవేర్చార‌ని, ప్ర‌జ‌లంతా మెచ్చుకుంటున్న‌రాని ఆమె శ్లాఘించారు. ప్రజా తీర్పును గౌరవించాల్సిన టీడీపీ… కావాలని మండలిలో లేటు చేస్తూ… ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ మంత్రి లోకేష్ ఏదో ఘనకార్యం చేసినట్లు ఫీలవుతున్నార‌ని, బాగా బలిసిన కోడి చికెన్ షాపు ఎదుట‌కు వ‌చ్చి తొడగొడితే ఏమవుతుందో అంద‌రికీ తెలుసుని, కోసి కారం పెడతార‌ని, ఆ విషయం ఆయ‌న‌ తెలుసుకోవాల‌ని హిత‌వుప‌లికారు. పెద్దల సభంటే పెద్దల్ని, అనుభ‌వ‌జ్ఞుల‌ను పంపాలి కానీ, ఇంట్లోని దద్దమ్మల్నీ, దద్దోజనాన్నీ కాద‌ని పరోక్షంగా లోకేష్‌ను ఉద్దేశిస్తూ ఆమె సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నార‌ని, మండలి ఉండటం వేస్ట్ అనే అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని తెలిపారు.

Tags: chandrababu, ex minister naara lokesh naidu, nagari mla roja